Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 26 Jan 2022 07:35:21 IST

ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను: సాయి పల్లవి

twitter-iconwatsapp-iconfb-icon
ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను: సాయి పల్లవి

తాజాగా సాయి పల్లవి 'శ్యామ్ సింగ రాయ్' మూవీలోని 'ప్రణవాలయ' పాటకు డాన్స్ రిహార్సల్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. 'ఫిదా' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మొదటి సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారిన ఆమె నానితో రెండవసారి నటించిన 'శ్యామ్ సింగ రాయ్' చిత్రంతో గత నెల ప్రేక్షకుల ముందుకువచ్చింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ కూడా హీరోయిన్స్‌గా నటించారు. అయితే, వారికంటే ఎక్కువ పేరు సాయి పల్లవికి రావడం విశేషం. కాగా, ఈ సినిమాలో తాను దేవదాసి పాత్రలో నటించి ఆకట్టుకుంది. 

ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను: సాయి పల్లవి

ఇక ఇందులో ఉన్న 'ప్రణవాలయ' అనే పాటతో సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ పాటకు సాయి పల్లవి ఎంతగా ప్రాక్టీస్ చేసిందో తన ఇస్టాగ్రాంలో మేకింగ్ వీడియోలను షేర్ చేసి తెలిపింది. సాయి పల్లవి మంచి డాన్సర్. అయినా కూడా పర్‌ఫెక్షన్ కోసం చాలా శ్రమిస్తుంది. అందుకు ఉదాహరణే తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోలు. అంతేకాదు ఈ వీడియోలకు 'ప్రణవాలయ.. పాటకు డ్యాన్స్ చేస్తుంటే నాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రదర్శనల్లో ఇది ముందు వరుసలో నిలుస్తుంది. రూపాలి కంథారియా కుష్బూ వాకానిలకు ఈ క్రెడిట్స్ దక్కాలి' అని పోస్ట్‌లో పేర్కొంది సాయి పల్లవి.   



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International