ఫిబ్రవరి రేషన్‌ మార్చిలో తీసుకోవచ్చు: జేసీ

ABN , First Publish Date - 2021-03-05T04:32:19+05:30 IST

ఫిబ్రవరి నెలలో రేషన్‌ పొందనివారు ఈ నెల సరుకులతో కలిపి ఒకేసారి తీసుకోవచ్చని జేసీ మార్కొండేయులు తెలిపారు.

ఫిబ్రవరి రేషన్‌ మార్చిలో తీసుకోవచ్చు: జేసీ

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 4: ఫిబ్రవరి నెలలో రేషన్‌ పొందనివారు ఈ నెల సరుకులతో కలిపి ఒకేసారి తీసుకోవచ్చని జేసీ మార్కొండేయులు తెలిపారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో రేషన్‌ తీసుకోని రెండు లక్షల మంది కార్డుదారుల వివరాలను తహసీల్దార్లకు పంపామని తెలిపారు. పట్టణాల్లో శుక్రవారం నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో శనివారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు రేషన్‌ సరుకులు పొందవచ్చని చెప్పారు. గురువారం నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 7.38 లక్షల కార్డుదారులకు(81.26 శాతం), పట్టణ ప్రాంతాల్లో 1.81 లక్షల కార్డులకు రేషన్‌ పంపిణీ పూర్తయిందన్నారు. సమావేశంలో డీఎస్వో శివరామప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T04:32:19+05:30 IST