కుంటలో పడి తండ్రీకొడుకు మృతి

ABN , First Publish Date - 2022-05-17T09:01:20+05:30 IST

తండ్రి, కొడుకు... వారు అపురూపంగా చూసుకునే ఎడ్ల జత ఒకే క్షణం, ఒకే చోట చనిపోవడం ఆ కుటుంబంతోపాటు ఆ ఊరు మొత్తాన్ని కంటతడి పెట్టించింది. పల్నాడు జిల్లా

కుంటలో పడి తండ్రీకొడుకు మృతి

అపురూపంగా చూసుకునే ఎడ్లజత కూడా..


మాచవరం, మే 16: తండ్రి, కొడుకు... వారు అపురూపంగా చూసుకునే ఎడ్ల జత ఒకే క్షణం, ఒకే చోట చనిపోవడం ఆ కుటుంబంతోపాటు ఆ ఊరు మొత్తాన్ని కంటతడి పెట్టించింది. పల్నాడు జిల్లా మాచవరం మండలం  గ ంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మధిర నాగరాజు (32) తొమ్మిది ఎకరాలు కౌలు పొలం తీసుకొని పత్తి, మిర్చి పంట సాగు చేశాడు. ఈ ఏడాది చీడపీడల వలన  పైరు పూర్తిగా దెబ్బతిన్నది. ఆ పైరును దున్నివేసి మొక్కజొన్నపంట సాగు చేశాడు. చేలో ఉన్న పంటను సోమవారం ఇంటికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో కుమారుడు వెంకటచరణ్‌ను(8) తీసుకొని మొక్కజొన్న కండెలను ఎడ్లబండిలో వేసుకుని ఒక ట్రిప్పు కల్లంలోకి చేర్చాడు.  రెండవ ట్రిప్పు కోసం వెళ్తుండగా, ఊరికి సమీపంలో ఉన్న రామన్నకుంటను చూడగానే నీళ్లు తాగడానికి ఎడ్లు అటువైపు కదిలాయి. కొద్దిసేపటికే అవి కుంటలోకి వెళ్లిపోయాయి. కుంట లోతుగా ఉండటంతో ఎడ్లు ఒక్కసారిగా మునిగిపోయి..


బండి బోర్లపడింది. బండిమీద ఉన్న నాగరాజు, అతని కుమారుడు వెంకటచరణ్‌ కింద పడిపోయారు. బోర్ల పడిన బండి కింద చిక్కుకుపోయి ఊపిరాడక ఎడ్లు చనిపోయాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఎడ్లను, బండిని బయటకు తీశారు. అవి అప్పటికే చనిపోయాయి. తండ్రీ,కొడుకు జాడ కనిపించలేదు. కొందరు యువకులు కుంటలో దిగి వెతుకులాడగా వారి మృతదేహాలు కనిపించాయి.

Updated Date - 2022-05-17T09:01:20+05:30 IST