భూమి పట్టాచేయడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-06-07T10:14:29+05:30 IST

మరొకరి పేరు మీద పట్టా చేసిన తన భూమిని తనకు పట్టా చేయడం లేదంటూ కలత చెందిన శ్రీనివాస్‌ అనే రైతు తహసీల్దా ర్‌ కార్యాలయంపైకి ఎక్కి

భూమి పట్టాచేయడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 6: మరొకరి పేరు మీద పట్టా చేసిన తన భూమిని తనకు పట్టా చేయడం లేదంటూ కలత చెందిన శ్రీనివాస్‌ అనే రైతు తహసీల్దా ర్‌ కార్యాలయంపైకి ఎక్కి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో శనివారం చోటు చేసుకుంది.


బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పలపల్లి గ్రామానికి చెం దిన జిల్లెల్ల శ్రీనివాస్‌కు గ్రామశివారు సర్వే నంబర్‌ 774లో ఉన్న వ్యవసాయ భూమిలో 8 గుంటలను జిల్లెల్ల కనుకమ్మకు ఇటీవల పట్టా చేశారు. ఈ విష యంపై తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు.  తన భూమి తనకు పట్టా చేయడం లేదని విరక్తి చెంది తహసీల్దార్‌ కార్యాల యంపైకి ఎక్కి పెట్రోల్‌ పోసుకున్నాడు. గమనించిన స్థానికులు కిందికి దించి ఆ సుపత్రికి తరలించారు. తహసీల్దార్‌ వేణుగోపా ల్‌ను వివరణ కోరగా మోకాపైకి వెళ్లి విచారణ జరిపి బాధితుడికి న్యాయం చే స్తానని తెలిపారు. 

Updated Date - 2020-06-07T10:14:29+05:30 IST