రైతులకు ఒరిగేదేమీ లేదు : మాజీ మంత్రి వడ్డే

ABN , First Publish Date - 2020-06-06T08:41:51+05:30 IST

దేశంలో వ్యవసాయ రంగంపై కేంద్రప్రభుత్వ మంత్రివర్గ నిర్ణయం వల్ల రైతులకు పెద్దగా ఒరిగేది లేకపోగా టోకు

రైతులకు ఒరిగేదేమీ లేదు : మాజీ మంత్రి వడ్డే

ఉయ్యూరు, జూన్‌  5 : దేశంలో వ్యవసాయ రంగంపై కేంద్రప్రభుత్వ మంత్రివర్గ నిర్ణయం వల్ల రైతులకు పెద్దగా ఒరిగేది లేకపోగా టోకు వ్యాపారులు, దళారులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేసేవారికి మేలు కలుగుతుందని వ్యవసాయశాఖా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం ఉయ్యూరులో కొందరు రైతులకు వడ్డేకు శాలువా కప్పి సత్కరించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే వ్యవసాయ మార్కెట్‌ అంటూ రైతులు తమ పంటను ఎవరికైనా అమ్ముకోవచ్చని, ఇకపై ఎలాంటి ఆంక్షలు ఉండవని కేంద్ర కేబినేట్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రధాన మంత్రి మోదీ ప్రకటన వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. 2016 నుండి ఈవిధానం అమలులో ఉందన్నారు. 


ప్రధాని హామీలు అమలవకపోవటంతో ప్రతిఏటా రూ.13 లక్షల కోట్లు రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర కంటే ఎక్కువ లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా రైతుల జ్ఞానేశ్వరరావు, వీరయ్య, శోభన్‌బాబును సత్కరించారు. వడ్డేప్రసాద్‌, చిట్టబ్బాయి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-06T08:41:51+05:30 IST