గేదెను కాపాడబోయి రైతు మృతి

ABN , First Publish Date - 2022-01-25T05:59:21+05:30 IST

మండలంలోని నడింపల్లికి చెం దిన రైతు ఉపేంద్రనాయుడు(38) సోమవారం విద్యుత షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న గేదెను కాపాడబోయి మరణించాడు.

గేదెను కాపాడబోయి రైతు మృతి
ఉపేంద్రనాయుడు మృతదేహం

నార్పల, జనవరి24: మండలంలోని నడింపల్లికి చెం దిన రైతు ఉపేంద్రనాయుడు(38) సోమవారం విద్యుత షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న గేదెను కాపాడబోయి మరణించాడు. రైతు తనకున్న గేదెలను మేపునకు గ్రా మ సమీపంలోని పొలాలవైపు తీసుకెళ్లాడు. పొలాల వద్ద గాలిమరలకు సంబంధించిన 11 కేవీ విద్యుత తీగలు తెగి, కింద పడిపోయాయి. దానిని గమనించని గేదెలు విద్యుత తీగలను తాకాయి. దీంతో ఎనుముకు విద్యుత షాక్‌ తగిలి, కొట్టుమిట్టాడుతుండగా... అక్కడే ఉన్న రైతు ఉపేంద్రనాయుడు దానిని కాపాడే ప్రయత్నం చేశాడు. అతడికి విద్యుత షాక్‌ తగిలి, అక్కడికక్కడే మృతి చెందాడు. గే దె ప్రాణాలతో బయటపడింది. రైతుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ తెలిపారు.


Updated Date - 2022-01-25T05:59:21+05:30 IST