కోడికి రెండో పుట్టిన రోజు.. వేడుక మామూలుగా లేదుగా..

ABN , First Publish Date - 2022-01-02T22:09:12+05:30 IST

కోడిని పక్షి అందామంటే అన్ని పక్షుల్లాగా ఎగిరే టైపు కాదు. పెంపుడు జంతువులా మనల్నే నమ్ముకుని, మన ఇంట్లోనే ఉంటుంది కదా అని జంతువు అనడానికి వీల్లేదు. పక్షి కాదు, జంతువూ కాదు, అంతకు మించి అని చెప్పడమే కాదు..

కోడికి రెండో పుట్టిన రోజు.. వేడుక మామూలుగా లేదుగా..

కోడిని పక్షి అందామంటే అన్ని పక్షుల్లాగా ఎగిరే టైపు కాదు. పెంపుడు జంతువులా మనల్నే నమ్ముకుని, మన ఇంట్లోనే ఉంటుంది కదా అని జంతువు అనడానికి వీల్లేదు. పక్షి కాదు, జంతువూ కాదు, అంతకు మించి అని చెప్పడమే కాదు, ఏకంగా దానికి పుట్టినరోజు పండగ చేసి మరీ చాటారు. కోడి పుట్టినరోజు వేడుక నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కోడి చేత కేక్ కోయించి, తినిపించడమే కాదు, ‘చిన్ను’ అని వాళ్లు నోరారా పిలుచుకునే దాన్ని- కోడి అనడాన్ని కూడా సహించడం లేదు ఈ ఫ్యామిలి.


మామూలుగానే కోడిని ద్విజుల కేటగిరిలో వేస్తుంటారు. ద్విజులు- అంటే రెండు సార్లు పుట్టిన శ్రేష్టవర్గం అన్నమాట. కోడికి కూడా గుడ్డుగా తొలి జన్మ అయితే, ఆపై గుడ్డు నుంచి పిల్లగా మరో పుట్టుక. అలా రెండు సార్లు పుట్టే కుక్కుటము- అనగా కోడికి, సారీ ‘చిన్ను’కి రెండవ పుట్టినరోజు వేడుకలు జరిపించిందీ కుక్కుట కుటుంబం!





Updated Date - 2022-01-02T22:09:12+05:30 IST