Abn logo
Jul 31 2021 @ 01:30AM

మోడువారుతున్న బీడుభూములు

సీపీఎం తిప్పర్తి మండల మహాసభలో మాట్లాడుతున్న సుధాకర్‌రెడ్డి

  సీపీఎం జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి

మునుగోడు రూరల్‌/ తిప్పర్తి, జూలై30:  సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని వెల్మకన్నె గ్రామంలో నిర్వహించిన పార్టీ శాఖా మహాసభలో ఆయన  మాట్లా డారు.  జిల్లాలోని డిండి ప్రాజెక్టు ద్వారా మూడు లక్షల ఎకరాలకు నీళ్లు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం డీపీఆర్‌ అప్‌లోడ్‌ చేయలేదని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి, పనులు వేగవంతంగా చేపట్టి ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసి నల్లగొండ, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు.  ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బస్సులను ప్రధాన రహదారులకు పరిమితం చేశారని గతంలో మాదిరిగా ప్రతి పల్లెకూ బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, సీపీఎం మండల కార్యదర్శి మిర్యాల వెంకన్న, జిల్లా నాయకులు చేపల మారయ్య, సీనియర్‌ నాయకులు గోపాల్‌రెడ్డి, పర్సనగోని యాదగిరి, అబ్బయ్య, నర్సింహ, శేఖర్‌, రాములు, గోపాల్‌ పాల్గొన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు సమరశీల ఉద్యమాలకు సిద్దం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.  తిప్పర్తిలో నిర్వహించిన సీపీఎం ఏడో మండల మహాసభలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి ప్రజా సమస్యలపై నిరంతరంగా పోరాటం చేస్తున్నది కమ్యునిస్టులేనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దేశ సంపదను లూటీ చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా సామాన్య ప్రజల అభివృద్ధికి పాటుపడాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు పాలడుగు నాగార్జున, ఎండి.సలీం, శంకరయ్య, బీరెడ్డి సీతారాంరెడ్డి, వెంకటరమణారెడ్డి, బీమగాని గణేష్‌, గండమళ్ల రాములు, మన్నెం బిక్షం, వెంకన్న, రమణయ్య, శశిధర్‌ పాల్గొన్నారు.