Abn logo
Jan 27 2021 @ 01:02AM

పంచాయతీ పోరులో టీడీపీ గెలుపు తథ్యం

ఎమ్మెల్సీ బుద్ద, మాజీ ఎమ్మెల్యే పీలా


తుమ్మపాల, జనవరి 26: పంచాయతీ పోరులో టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పేర్కొన్నారు. తుమ్మపాలలో మంగళవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను, మొండి వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాజ్యాంగాన్ని గౌరవించని సీఎం, మంత్రులు పదవుల్లో కొనసాగేందుకు అనర్హులన్నారు. ప్రతీ అంశాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని, పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అనంతరం టీడీపీ శ్రేణులతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోట్నీ బాలాజీ, మళ్ల సురేంద్ర, పచ్చికూర రాము, కె.వెంకటసావిత్రి, పల్లెల గంగాభవాని, ఎన్‌.గణేశ్‌, కర్రి బాబి పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement