పర్చూరు ప్రభుత్వ వైద్యశాల
రెండేళ్ళుగా గైనకాలజిస్టు లేని వైనం
అవస్థలు పడుతున్న గర్భిణులు
అలంకార ప్రాయంగా ల్యాబ్
పర్చూరు, జూలై 3: ప్రభుత్వ వైద్యశాలలో సరిప డ వసతులు ఉన్నా సిబ్బంది లేక వైద్య సేవలు అం దడంలేదు. పేరుకే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ).. వైద్యం మాత్రం సబ్సెంటర్కు మించి లేదు. కార్పొరేట్ వైద్యశాలలను తలపించేలా వసతు లు ఉన్నా రోగులకు ఉపయోగ పడటంలేదు. రెండే ళ్లకు పైగా గ్రైనకాలజిస్టు లేకపోవటంతో గర్భిణులు, స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి స మస్య వచ్చినా పొరుగు పట్టణాలకు పరుగులు తీ యాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్థిక స్థోమతలేని నిరు పేదలు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీలను ఆశ్రయిస్తు న్నారు. స్త్రీలకు సంబంధించిన వైద్యులు లేకపోవటం తో శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. పర్చూ రు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక్క ట్యూబెక్టమీ ఆపరేషన్లు కూడా జరగటం లేదంటే పరిస్థితి ఎ లా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పంటి వైద్యం వారంలో మూడు రోజులే..
నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్‌లో భాగంగా పం టి వైద్యులు విధిగా మూడు రోజలు ఆయా పీహెచ్ సీలలో విధులు నిర్వహించాలి. దీంతో సీహెచ్‌సీలో మూడు రోజులు రోగులకు పంటి వైద్యం అందిచాలి. అయితే, ఎప్పుడు వైద్యుడు అందుబాటులో ఉంటా డో అర్థంకాక రోగులు అవస్ధలు పడుతున్నారు.
పేరుకే రక్త పరీక్షా కేంద్రం
పర్చూరు ప్రభుత్వ వైద్యశాలలో వసతులతో పాటు, రక్త పరీక్షా కేంద్రంలో లక్షల రూపాయలు విలువ చేసే వైద్య పరికరాలు ఉన్నా, వాటిని విని యోగించేందుకు రసాయనాలు అందుబాటులో లే వు. దీంతో పరీక్షా కేంద్రం అలంకారప్రాయంగా మా రింది. కేవలం సుగర్ పరీక్షకే ల్యాబ్ పరిమితం అ య్యిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో వచ్చు. హెచ్‌బీఎస్(ఎజీఈ), హెచ్‌సీవీ, ఆర్పీఆర్, టైపాయిడ్ టెస్టులు కూడా అందుబాటులో లేని దు స్థితి ఉంది. పరీక్షల కోసం రోగులు ప్రయివేట్ ల్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు లేక ప్రజలు ఇ బ్బందులు పడుతున్నా పట్టించుకునే వారేలేరు. కనీ సం వైద్యశాలలో రోగులకు ఎలాంటి సేవలు అందు తున్నాయి, పరిస్థితి ఎలా ఉందని పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం తమ పనికాదన్న రీతిలో ముఖం చాటేస్తున్నారు. దీంతో నిరుపేదల పరిస్థితి దయనీ యంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాఽధికారులు స్పందించి ప్రభుత్వ వైద్యశాలలో పూర్తిస్థాయి సిబ్బం దిని ఏర్పాటు చేయటంతోపాటు వైద్యసేవలను మెరుగు పరచాలని ప్రజలు కోరుతున్నారు.