మా భూములపై బడా నేతల కన్ను పడింది

ABN , First Publish Date - 2022-09-28T05:30:00+05:30 IST

సుమారు 60 ఏళ్లగా మా అధీనంలో ఉన్న భూములను ఆక్రమించుకునేందుకు బడా నేతలు కన్నేశారు. వారి బారి నుంచి భూములను కాపాడాలంటూ దాదాపు 40 మంది కొండకింద మాదిగపల్లె రైతులు కలెక్టర్‌ పీఎస్‌ గిరీషాకు ఫిర్యాదు చేశారు.

మా భూములపై బడా నేతల కన్ను పడింది
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న దుద్యాల గ్రామస్తులు

కాపాడాలంటూ కొండకింద మాదిగపల్లె రైతులు కలెక్టర్‌కు మొర

 

రాయచోటి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 28: సుమారు 60 ఏళ్లగా మా అధీనంలో ఉన్న భూములను ఆక్రమించుకునేందుకు బడా నేతలు కన్నేశారు. వారి బారి నుంచి భూములను కాపాడాలంటూ  దాదాపు 40 మంది కొండకింద మాదిగపల్లె రైతులు కలెక్టర్‌ పీఎస్‌ గిరీషాకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళితే.... వాగులు, వంకలు అయిపోయాయి.. చివరికి దళితుల అధీనంలో ఉన్న భూములను కబ్జా చేసేందుకు సంబేపల్లె మండలం దుద్యాలలో ఓ నేత కన్నేశాడు. 60 ఏళ్లగా మా అధీనంలో ఉన్న భూములు ఆసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా ఇతరులకు అప్పజెప్పాలని కొందరు చోటా మోటా నేతలు పన్నాగం పన్ను తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండు తరాలుగా  సర్వే నెంబర్లు 1179, 2897, 2805, 2525లో ప్రతి రైతుకూ రెండెకరాల  పొలం ఉంది. అంతేకాకుండా పల్లం మాలపల్లెలో కూడా దాదాపు 30మంది రైతులకు సర్వే నెంబరు 2919, 1138, 2917లలో ప్రతి రైతుకు రెండెకరాల 30 సెంట్లు పొలం ఉంది. ఇంతకాలం వర్షాలు లేక పంటలు పండకపోయినా... ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నామన్నారు. ఇప్పుడు మా భూములపై బడాబాబుల కన్ను పడింది. ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తహసీల్దార్‌ కార్యాలయంలో ఆ భూములను అసైన్‌మెంట్‌ కమిటీలో ఇతరులకు ఇసు ్తన్నట్లు గాలికబురు పంపించారు. విషయం తెలుసుకున్న రైతులు హుటాహుటిన   తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తమ భూములు ఎవరికీ పంపిణీ చేయవద్దని కాళ్ల వేళ్లా పడి ప్రాధేయపడ్డామన్నారు. ఈ విషయం నా పరిధిలో లేదని తహసీల్దార్‌ చేతులెత్తేయడంతో చేసేది లేక దాదాపు 40 మంది రైతులు కలెక్టర్‌ కార్యాలయం చేరుకున్నారు. దాదాపు 60 ఏళ్లుగా మా అధీనంలో ఉన్న భూములను ఇతరులు ఎవరికీ ఇవ్వద్దు అని కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ఈ విషయంపై కలెక్టర్‌ స్పందిస్తూ మీ భూములు ఎవరికీ ఇవ్వం మీరు నిశ్చింతగా వెళ్లండని హామీ ఇచ్చారు.


  

Updated Date - 2022-09-28T05:30:00+05:30 IST