స్తంభాన్ని ఢీకొని ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2020-02-20T06:52:01+05:30 IST

ఆ యువకుడు ఇంజనీరింగ్‌ చదు వుకోడానికి తెనాలి నుంచి వచ్చి తాడేపల్లి గూడెంలో గది అద్దెకు తీసుకుని

స్తంభాన్ని ఢీకొని ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

తాడేపల్లిగూడెం క్రైం, ఫిబ్రవరి 19: ఆ యువకుడు ఇంజనీరింగ్‌ చదు వుకోడానికి తెనాలి నుంచి వచ్చి తాడేపల్లి గూడెంలో గది అద్దెకు తీసుకుని ఉంటు న్నాడు. అతడిని చూడ డానికి రాత్రి వేళ  వచ్చిన తండ్రిని తను అద్దెకు ఉంటున్న గదిలో ఉంచి కంబెన్డ్‌ స్టడీకి స్నేహితుల వద్దకు వెళ్లాడు. తెల్లవారుజా మున మోటార్‌ సైకిల్‌తో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకు ఇంకా వస్తాడని ఎదురుచూస్తున్న తండ్రికి అతడి మృతి సమాచారం అందడంతో గుండెల విసేలా రోదించాడు.

తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి మాలి దినేష్‌ కుమార్‌ (22) మృతి చెందాడు. దీనికి సంబందించి పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలికి చెందిన రైల్వే ఉద్యోగి మాలి జయకుమార్‌ కుమారుడు దినేష్‌కుమార్‌ తాడేపల్లిగూడెంలో ఇంజనీరింగ్‌ చదువుతున్నా డు. మంగళవారం రాత్రి దినేష్‌కుమార్‌ తండ్రి జయకుమార్‌ కొడుకును చూసేందుకు తాడేపల్లిగూడెం వచ్చాడు. తండ్రిని తన రూం వద్ద దింపి స్నేహితులతో కలిసి చదువుకోడానికి వెళతానని, ఉదయమే వస్తానని చెప్పాడు. బుధవారం తెల్లవా రుజామున తిరిగి రూమ్‌కు వస్తుండగా మోటార్‌ సైకిల్‌తో కరెంట్‌ స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్రగాయాలతో మృతి చెందాడు. తెల్లవారేసరికి దినేష్‌కుమార్‌ మృతి చెందినట్టు జయకుమార్‌కు ఫోన్‌ చేయడంతో కన్నీరు మున్నీరయ్యాడు. చాలా రోజుల తర్వాత కొడుకును చూద్దామని వచ్చానని, కుమారుడి మృతిని చూస్తాననుకోలేదన్నారు. రాత్రి తనతోపాటు ఉండి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని బోరున విలపించాడు.  ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.

Updated Date - 2020-02-20T06:52:01+05:30 IST