అంతరించిపోతున్న కళలను వెలికితీయాలి

ABN , First Publish Date - 2022-05-25T05:29:52+05:30 IST

ప్రస్తుత సమాజంలో అంతరించిపోతున్న సంప్రదాయ కళలను వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉంద ని మహబూబ్‌ నగర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ కే.సి నర్సింహులు అన్నారు.

అంతరించిపోతున్న కళలను వెలికితీయాలి
డంపింగ్‌ యార్డ్‌ను పరిశీలిస్తున్న చైర్మన్‌, అధికారులు

- మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు

- ఏనుగొండలో ప్రారంభమైన భక్తసిరియాల వీధి నాటక ప్రదర్శన

మెట్టుగడ్డ (ఏనుగొండ), మే 24 : ప్రస్తుత సమాజంలో అంతరించిపోతున్న సంప్రదాయ కళలను వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉంద ని మహబూబ్‌ నగర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ కే.సి నర్సింహులు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఏనుగొండ హనుమాన్‌ దేవాలయం పక్కన హనుమాన్‌ భజన మండలి వారి ఆధ్వర్యంలో భక్త సిరియాళ వీది నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు గ్రామ ప్రముఖు లు ముఖ్య అతిథులుగా హాజరై  ఈ వీధి నాటకా న్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ప్రస్తుతం సినిమాల మోజులో పడి యువత చెడి పోతున్నారన్నారు. ప్రాచీనకాలం నుంచి వస్తున్న వీధి నాటకాలు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చేవని, అలాంటి కళలు నేడు అంతరించిపోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్య అతిథులను సన్మానించారు. తర్వాత నాటక ప్రదర్శన ప్రారంభమైంది. మొదటి రోజు శ్రీదండ మహారా జు, సుగుణదేవి కల్యాణం, సిరియాలుడి జననానికి సంబంధించి సన్నివేశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖు లు కోరమోని వెంకటయ్య, గంగాధర్‌, పురుషోత్తం, హనుమాన్‌ భజన మండలి అధ్యక్షుడు నీటూరి నర్సింహులు, కళాకారులు నీటూరి కృష్ణయ్య, నర్సింహులు, సత్యం, శ్రీరాములు, బుడ్డ రాములు, కనకయ్య, గోపాల్‌ పాల్గొన్నారు.

డంపింగ్‌యార్డ్‌ పరిశీలన

మహబూబ్‌నగర్‌ : మునిసిపాలిటీ పరిధిలోని డంపింగ్‌యార్డ్‌ను మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, ముడా చైర్మన్‌ వెంకన్న, కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌లు మంగళవారం పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి వాటిని ఎరువుగా మార్చేవిధానం, బయోగ్యాస్‌ ప్లాంట్‌లపై చ ర్చించా రు. వెట్‌ చెత్త ద్వారా బయోగ్యాస్‌ తయారుచేసే విధానాలపై మాట్లాడారు. త్వరలోనే 1.2 ఎకరాల్లో బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణ యించారు.ఇళ్ళల్లో మిగిలిపోయిన వ్యర్థాలు అన్నం, పాడైన కూరగాయలు వంటి వాటితో బయోగ్యాస్‌ తయారవుతుందని తెలిపారు. టీఎస్‌ రెడ్‌కో బయోగ్యాస్‌ ప్లాంట్‌ నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ రెడ్‌కో ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:29:52+05:30 IST