చైర్‌పర్సన్‌ ప్రోత్సాహం మరువలేనిది

ABN , First Publish Date - 2022-01-27T05:03:58+05:30 IST

చైర్‌పర్సన్‌ ప్రోత్సాహం మరువలేనిది

చైర్‌పర్సన్‌ ప్రోత్సాహం మరువలేనిది
ఒకే డ్రెస్‌ కోడ్‌లో చైర్‌పర్సన్‌ మంజులారమేష్‌, కౌన్సిలర్లు

వికారాబాద్‌, జనవరి 26 : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారమేష్‌ ప్రోత్సాహం మరువలేనిదని పట్టణ మహిళా కౌన్సిలర్లు ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయం అంటేనే ఎప్పుడూ ఏదో టెన్షన్‌.. దీంతో సరదాలు, సంతోషాలకు దూరం అవ్వాల్సి వస్తుందని.. అందుకే చైర్‌పర్సన్‌ ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ తన కౌన్సిల్‌లోని మహిళా కౌన్సిలర్లందరితో మమేకమై వారిలో సరికొత్త ఉల్లాసం, ఉత్తేజం నింపడానికి సమయం దొరికినప్పుడల్లా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అందులో భాగంగానే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మహిళా కౌన్సిలర్లు అందరూ కూడా ఒకే డ్రెస్‌ కోడ్‌లో వస్తే బాగుంటుందని ఆలోచించిన ఆమె అందరికీ ఒకే రకమైన డ్రెస్‌ కోడ్‌ ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో వారందరూ ఒకే డ్రెస్‌ కోడ్‌లో వచ్చి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. జెండావిష్కరణ అనంతరం మహిళా కౌన్సిలర్లు అందరూ కలిసి చైర్‌పర్సన్‌తో పట్టణంలోని గాంధీ పార్క్‌లో సరదాగా గడిపారు.

Updated Date - 2022-01-27T05:03:58+05:30 IST