విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-09T05:11:09+05:30 IST

వినియోగదారులు, ఉద్యోగులు, సిబ్బందికి శాపంగా మారనున్న విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను వెంటనే ఉపసంహరించు కోవాలని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ శాలన్న, కన్వీనర్‌ దుర్గాప్రసాద్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
జలవిద్యుత్‌ కేంద్రం ముందు ధర్నా చేస్తున్న విద్యుత్‌ జేఏసీ నాయకులు

- విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌

- విద్యుత్‌ కార్యాలయం ముందు ధర్నా

గద్వాల అర్బన్‌, ఆగస్టు 8 : వినియోగదారులు, ఉద్యోగులు, సిబ్బందికి శాపంగా మారనున్న విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను వెంటనే ఉపసంహరించు కోవాలని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ శాలన్న, కన్వీనర్‌ దుర్గాప్రసాద్‌ కేంద్ర ప్రభుత్వాన్ని  డిమాండ్‌ చేశారు. నూతన సవరణ చట్టాన్ని సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర  కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని విద్యుత్‌శాఖ డీఈ కార్యాలయం ముందు ఆ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు, వినియోగ దారులు, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణకు సిద్ధపడాలనుకోవడం శోచనీయమ న్నారు. కొత్త బిల్లుత్లో అత్యవసర సేవలందించే వర్గాల కు సైతం సబ్సిడీలు కరువయ్యే ప్రమాదముం దన్నా రు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేం ద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. లేని పక్షంలో నిరవధిక సమ్మెకు సిద్ధపడతామని హెచ్చరిం చారు. ధర్నాలో 1104, 327, ఇంజనీర్స్‌, డిప్లొమో ఇంజనీర్స్‌ అసోసియేషన్లు, ఎస్టీ, ఎస్సీ వెల్ఫేర్‌ అసోసి యేషన్‌, టీఆర్‌వీకేఎస్‌, హెచ్‌-82 యూనియన్ల నాయకులు రామకృష్ణ, నరసింహ, అశోక్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.   


విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

జూరాల జల విద్యుత్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం జూరాల జలవిద్యుత్‌ కేంద్రం వద్ద నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ ఉద్యోగులు, అకౌంటెంట్లు, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2022-08-09T05:11:09+05:30 IST