కేంద్రీయ విద్యాలయం కోసం కృషి అభినందనీయం

ABN , First Publish Date - 2022-01-22T06:11:20+05:30 IST

ఉలవపాడు మండలం కరేడు పంచాయతీ పరిధిలో జాతీయ రహదారిపై ఏకలవ్య కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డిని శుక్రవారం ప్రకాశం జిల్లా యానాదుల సమాఖ్య నాయకులు కలిసి ధన్యవాదాలు తెలిపారు.

కేంద్రీయ విద్యాలయం కోసం కృషి అభినందనీయం
డైరీ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

కందుకూరు, జనవరి 21: ఉలవపాడు మండలం కరేడు పంచాయతీ పరిధిలో జాతీయ రహదారిపై ఏకలవ్య కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డిని శుక్రవారం ప్రకాశం జిల్లా యానాదుల సమాఖ్య నాయకులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యానాదుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి చేవూరి దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్ల నిధులతో ఈ కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే ప్రణాళికాబద్ధ కృషే కారణమని పేర్కొన్నారు. యానాదుల సమస్యల గురించి అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న యానాదుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికోసం చిత్తశుద్ధితో పాటుపడుతున్నాడన్నారు.ఈ కార్యక్రమంలో యానాదుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అద్దంకి అంకారావు, చేవూరి దుర్గాప్రసాద్‌, పోట్లూరి లక్ష్మయ్య, కావూరి నరేష్‌, ఆదిపోగు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతన్న డైరీ ఆవిష్కరణ

కందుకూరు : ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో ప్రచురించిన రైతన్న డైరీని శుక్రవారం కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు, రైతులకు అవసరమైన సమాచారంతో కూడిన డైరీని  ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ముద్రించటం అభినందనీయమన్నారు. ఇందుకోసం చొరవ తీసుకున్న కే.వీరారెడ్డి అభినందనీయుడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతుసంఘం నాయకులు మాట్లాడుతూ జామాయిల్‌, సుబాబుల్‌ కర్రకు కనీస గిట్టుబాటు ధర లేక గత కొన్నేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని వారు ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కే.వీరారెడ్డితో పాటు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి కోటేశ్వరరావు, గణేశం గంగిరెడ్డి, తొట్టెంపూడి శ్రీనివాసరావు, పాల్గొన్నారు.


Updated Date - 2022-01-22T06:11:20+05:30 IST