మామిడి రైతులపై కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2020-04-02T19:04:07+05:30 IST

కరోనా ప్రభావం మామిడి రైతులపై పడింది.

మామిడి రైతులపై కరోనా ప్రభావం

వనపర్తి: కరోనా ప్రభావం మామిడి రైతులపై పడింది. ముందుగా కాసిన తోటలనుంచి కాయలు నేలరాలిపోతున్నాయి. పరిస్థితి చేయిదాటిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆంక్షలు తీవ్రంగా ఉండడంవల్ల మామిడి అమ్మకాలు కూడా దెబ్బతినే అవకాశముంది. వ్యవసాయపనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజలు కూలి పనులకు కూడా వెళ్లకపోవడంతో మామిడి రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది.


వనపర్తి జిల్లాలో సుమారు 20వేల ఎకరాల్లో మామిడి తోటలు కాపుదశలో ఉన్నాయి. 15వేల ఎకరాలకుపైగా తోటలు కాపుదశలో ఉన్నాయి. సాధారణంగా మార్చి రెండోవారం నుంచి మామిడి కోతలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది కోత సమయానికి కరోనాతో ఆంక్షలు విధించడంతో ఎవరూ బయటకు రావడంలేదు. ఫలితంగా కాయలు కోయడానికి కూలీలు దొరకడంలేదు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మామిడి రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు.

Updated Date - 2020-04-02T19:04:07+05:30 IST