డిజిటల్‌ లైబ్రరీలతో విద్యావిప్లవం

ABN , First Publish Date - 2021-08-06T06:10:29+05:30 IST

ప్రతి గ్రామ పంచాయతీకి ఒక డిజిటల్ గ్రంథాలయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. ఎందరో విద్యార్థులు, ఉద్యోగార్థులు పల్లెల్లో చదువు కొనసాగించే సౌకర్యాలు...

డిజిటల్‌ లైబ్రరీలతో విద్యావిప్లవం

ప్రతి గ్రామ పంచాయతీకి ఒక డిజిటల్ గ్రంథాలయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. ఎందరో విద్యార్థులు, ఉద్యోగార్థులు పల్లెల్లో చదువు కొనసాగించే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పోటీ పరీక్షల సన్నద్ధత, విజ్ఞాన సముపార్జనలో పట్టణాల్లో ఉండే వారికున్న అవకాశాలు పల్లెల్లో ఉండేవారికి లేవు.  ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకూ పాఠ్యాంశాలే కాకుండా వివిధ రంగాలకు సంబంధించిన విజ్ఞాన భాండాగారం ఒక చోట లభ్యమయ్యే సౌకర్యం కలుగజేయడం యువతకు ఉపయుక్తంగా ఉంటుంది.  అయితే ఈ యజ్ఞం కార్యరూపం దాల్చడానికి ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో కేవలం ముప్పై శాతం ప్రభుత్వ పాఠశాలలకే కంప్యూటర్ అందుబాటులో ఉంది. అందులో మళ్ళీ కేవలం 11శాతం మేరకే అంతర్జాలం అందుబాటులో ఉంది. అంటే 90 శాతం స్కూల్స్‌కి అంతర్జాలం సదుపాయం ఇప్పటికీ లేదు. ఈ విషయంలో రాష్ట్రంలో స్కూళ్ల లెక్కలు, గ్రామాల లెక్కలు ఏమాత్రం భిన్నంగా ఉండవు. ఈ పాఠశాలలన్నింటికీ కంప్యూటర్లు, వాటి పరికరాలు, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్, గదులు సమకూర్చడం అవసరం. వీలయితే డిజిటల్ లైబ్రరీలో హార్డ్‌కాపీలు (పుస్తకాలు), వివిధ విజ్ఞానగ్రంథాలు అందుబాటులో ఉంచేలా చూడాలి. విద్యలో విప్లవానికి తోడ్పడితే అది సామాజిక పురోగతికి పెట్టుబడిగా మారుతుంది. 

డా. డివిజి శంకరరావు

Updated Date - 2021-08-06T06:10:29+05:30 IST