అదే నిర్లక్ష్యం...

ABN , First Publish Date - 2020-03-31T11:37:10+05:30 IST

రోజులు గడుస్తున్నా, కరోనా తీవ్రత పెరుగుతున్నా, ప్రభుత్వ లాక్‌డౌన్‌ నిబంధనలు పెరుగుతున్నా ప్రజల్లో మాత్రం

అదే నిర్లక్ష్యం...

భౌతిక దూరం పాటించని ప్రజలు

ప్రజాప్రతినిధులు సైతం అదే దారిలో..

ఆ 155 మంది గుర్తింపులో జాప్యం

ఆ పర్యవసనాలు దేనికి దారి తీస్తాయో..?

నిర్బంధంలో సడలింపు దేనికి సంకేతం

ఇలా అయితే కరోనా కట్టడి సాధ్యమా...?


అనంతపురం, మార్చి30 (ఆంధ్రజ్యోతి) : రోజులు గడుస్తున్నా, కరోనా తీవ్రత పెరుగుతున్నా, ప్రభుత్వ లాక్‌డౌన్‌ నిబంధనలు పెరుగుతున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. యథేచ్ఛగా, గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. అంటే వీరికి కరోనా అంటుకుం టుందన్న భయం లేదా లేకపోతే తమకేం కాదనే ధైర్యమా అన్నది అంతుబట్టకుండా ఉన్నది. నిత్యావసరాల కోసమంటూ ప్ర భుత్వం  ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ మినహాయింపులతో కూడిన సడలింపు ఇవ్వడంతో జనం రోడ్లపైకి తండోపతండాలుగా వస్తున్నారు.


జనాలకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు సైతం మందీమార్బలాన్ని వెంటేసుకుని భౌతిక దూరం పాటించ కుండా రేషన్‌ పంపిణీలోనూ, ఉచిత భోజన ఏర్పాట్లలో నూ పా ల్గొంటున్నారు. వైరస్‌ విస్తరిస్తే ఎంత ప్రమాదకరమో అన్న ది ప్రజాప్రతినిధులుగా వారే ముందుగా గుర్తించాలి.  సో మవారం పాతూరు మార్కెట్‌లోనూ, కదిరిలో రేషన్‌ పంపిణీలోనూ ప్రజలు గుంపులుగుంపులుగా గుమిగూడారు. పాలు, నీళ్లు, మెడికల్‌ షాపులకంటూ రిలాక్స్‌గా రోడ్లపై తిరిగారు. ధర్మవరం పట్టణంలో విద్యుత్‌ బిల్లులు చెల్లించేందు కు ప్రజలు గుంపులుగా పోటీపడ్డారు. ఇలా ప్రతిచోటా భౌ తిక దూరాన్ని పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం చూపుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ మాత్రమే  ఎండవేడిమి తాళలేక ప్రజలు బయటకు రా కుండా ఇళ్లలోనే ఉంటున్నారు. 


ఎందుకింత నిర్లక్ష్యం....?

జిల్లాలో 5 వేల పడకల ఏర్పాటుకు  జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు. అంటే భవిష్యత్‌లో కరోనా తీవ్రతతో తలెత్తే పరిణామాలు దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్నది అర్థమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆయన ప్రతి నియోజకవర్గంలో 200 నుంచి 600 వరకూ పడకలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ప్రజలు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారో అ ర్థం కావడం లేదు. కరోనా మహ మ్మారి నుంచి బయటపడాలంటే లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని ప్ర భుత్వం, జిల్లా యంత్రాంగం పదే పదే చెబుతున్నా ఎం దు కు పెడచెవిన పెడుతున్నారో  అంతుపట్టని విషయంగా ఉంది. 


155 మందిని గుర్తించడంలో జాప్యమెందుకో..?

విదేశాల్లో ఉన్న వారు జిల్లాకు 1015 మంది వచ్చారు. వీరిలో 860 మందిని గుర్తించారు. మిగిలిన 155 మందిని ఇప్పటి వరకూ గుర్తించలేదు. గుర్తించని వారిలో పట్టణ ప్రాంతాల్లో 126 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 29 మంది ఉన్నారు. వీరిని గుర్తించడంలో జాప్యం ఎందుకు జరుగు తుందో అర్థం కావడం లేదు. విదేశాల నుంచి వచ్చిన ప్ర తి ఒక్కరి పాస్‌పోర్టు ఆధారంగా ఇప్పటికే గుర్తించాల్సి ఉంది. గుర్తించకపోవడం మూలంగా ఆ 155 మంది జిల్లాలో స్వేచ్ఛగా వారి వారి ప్రాంతాల్లో తిరుగుతున్నారు.


తద్వారా కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం ఇబ్బం దికరంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. ఫోన్‌ స్విచ్చా్‌ఫలో ఉందని, ఫోన్‌ నెంబర్‌ లేదని, ఇంటికి తాళం వేశారని తప్పుడు అడ్ర్‌సలు ఇచ్చారని, ఇతర జిల్లాల్లో ఉం టున్నారని, వేరే రాష్ర్టాల్లో ఉంటున్నారనే సమాధానాలు మాత్రమే అధికారుల నుంచి వస్తున్నాయి. 


పోలీసుల మెతక వైఖరితోనే రోడ్లపైకి ప్రజలు 

లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలుచేయడంలో పోలీసులు మెతక వైఖరి అవలంభిస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పోలీసులు మెతకవైఖరి అవలంభించడం వల్లే రోడ్లపైకి ప్రజలు వస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఉదయం 11 గంటల వరకే నిబంధనలు సడలించినప్పటికీ ఆ తరువాత కూడా ప్రజలు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నారంటే పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా కట్టడి చేయాలంటే పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించా ల్సిన అవసరం ఉంది. 


జిల్లాలో సోమవారం నాటి సంఘటనలివీ...

 గుత్తి సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద పెద్దవడుగూరు పోలీసులు బెంగళూరు నుంచి హైదరాబాదుకు వెళ్తున్న రెండు కంటైనర్‌ వాహనాలను తనిఖీ చేశారు. ఆ వాహనా ల్లో 122 మంది ఉన్నారు. వారంతా బెంగళూరు నుంచి త మ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు వెళ్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవిశంకర్‌ రెడ్డిలు వారిని అక్కడే ఆపేశారు. గేట్స్‌ ఇంజనీరింగ్‌ కాలే జీ, గుత్తి పట్టణంలో వసతి కల్పించడంతో పాటు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. 


బెళుగుప్ప మండలం విరుపాపల్లిలో ఇటీవల తమిళ నాడు, బెంగళూరు రాష్ర్టాలకు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వచ్చిన 25 మందికి గృహనిర్బంధ నోటీసులు ఇచ్చారు. 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు. 


ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వలస కూలీలు దాదాపు 80 మంది కర్ణాటకలోని హాసన్‌కు ఇటీవలే వెళ్లారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో అమరాపురం మండల సరిహద్దులో పోలీసులు అనుమతించలేదు. దీంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


Updated Date - 2020-03-31T11:37:10+05:30 IST