దుల్హన్‌ పథకాన్ని వెంటనే కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-06-26T05:21:27+05:30 IST

ముస్లిం యువతుల పెళ్లిళ్లకు ఎంతో దోహదపడే దుల్హ న్‌ పథకాన్ని కొనసాగించాలని పీలేరు టీడీపీ నేతలు జగన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

దుల్హన్‌ పథకాన్ని వెంటనే కొనసాగించాలి
పీలేరులో నిరసన తెలియజేస్తున్న టీడీపీ నాయకులు

పీలేరు, జూన్‌ 25: ముస్లిం యువతుల పెళ్లిళ్లకు ఎంతో దోహదపడే దుల్హ న్‌ పథకాన్ని కొనసాగించాలని పీలేరు టీడీపీ నేతలు జగన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆమేరకు  శనివారం పీలేరులో టీడీపీ మైనార్టీ నేతలు  నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కోటపల్లె బాబురెడ్డి, మల్లెల రెడ్డిబాషా మాట్లాడుతూ దుల్హన్‌ పథకాన్ని అటకెక్కించిన జగన్‌ ప్రభుత్వం రంజాన్‌ తోఫా, విదేశీ విద్య, మైనారిటీ కార్పొరేషన్‌ రుణాలను పూర్తిగా మరిచిపోయిందన్నారు. ఎన్టీఆర్‌ హయాంలో ప్రారంభమైన మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా చంద్రబాబు హయాం వరకు లక్షలాది మం ది నిరుద్యోగ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణనిచ్చి 50 శాతం సబ్సిడీతో రుణాలు అందించారని గుర్తు చేశారు.  తాను అధికా రంలోకి వస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తానని మాయ మాటలు చెప్పి ముస్లింల ఓట్లు పొం దిన జగన్‌ అధికారంలోకి వచ్చాక నమ్మకద్రోహం చేశారన్నారు.  కార్యక్రమంలో నాయకులు లడ్డూ జాఫర్‌, షౌకత్‌అలీ, పోలిశెట్టి సురేంద్ర, అత్తర్‌ చాను, రహంతుల్లా, అజీజుల్లా, ఆబిద్‌ అలీ, శ్రీనాథరెడ్డి, రెడ్డిముని, ఎన్టీఆర్‌ నఫీస్‌,  శ్రీను పాల్గొన్నారు. 

పథకం ప్రారంభించే వరకూ పోరాటం

కలికిరి, జూన్‌ 25:  ముస్లింలకు దుల్హన్‌ పఽథకాన్ని తిరిగి ప్రారంభించేంత వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటామని పలువురు మైనారిటీ నాయకులు స్పష్టం చేశారు. రూ.50 వేల సాయంతో టీడీపీ అమలు చేస్తు న్న దుల్హన్‌ పథకాన్ని తాను అధికారంలోకి వస్తే రూ. లక్షకు పెంచుతానని ఎన్నికల ముందు జగన్మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని, చివరకు పథకానికి నిధులు లేవని చేతులెత్తేయడం శోచనీయమన్నారు. స్థానిక అమరనాథ రెడ్డి భవన్‌లో శనివారం మండల మైనారిటీ నాయకులు మీడియా సమా వేశంలో వారు మాట్లాడుతూ వైసీపీలో వున్న మైనారిటీ నాయకులు దల్హన్‌ పథకం కోసం జరిపే పోరాటంలో కలిసి రావాలని లేదంటే వారు మైనారిటీ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన్‌, మైనారిటీ నాయకులు రహం తుల్లా, ప్రముఖ రచయిత వేంపల్లె అబ్దుల్‌ ఖాదర్‌, ముస్తఫా హజరత్‌, అస్లామ్‌, ఎల్‌.కె.షఫీ, అఫ్రోజ్‌ బాషా, మున్వర్‌ ఆలీ, వైజాగ్‌ బాషా, మునాఫ్‌, షబ్బీర్‌, అన్సర్‌, బషీరున్నీసా, పర్వీన్‌, అక్బర్‌ పాల్గొన్నారు. 

మైనార్టీ సంక్షేమ పథకాలకు మంగళం

వాల్మీకిపురం, జూన్‌ 25: మైనార్టీల అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, గతంలో మైనార్టీల సంక్షేమం కోసం అమలు చేసే పథకాలకు సైతం మంగళం పాడేసిం దని టీడీపీ నాయకులు ఆరో పించారు. వాల్మీకిపురం పార్టీ కార్యాలయంలో శనివారం మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, పార్లమెంటరీ ఎస్సీ సెల్‌ ని యోజకవర్గ  మైనార్టీ నాయకుడు సయ్యద్‌బాషా మైనార్టీలు నాయకుల తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం లో మైనార్టీల అభివృ ద్ధికి పెద్దపీట వేస్తూ మైనార్టీ విద్యార్థులకు ఉచిత విదేశీ విద్య, దుల్హన్‌ పథకం, రంజాన్‌ తోఫా లాంటి పథకాలను ప్రవేశ పెట్టగా సీఎం జగన్‌ ప్రభుత్వం పథకాలకు పూర్తిగా మంగళం పాడేసింద న్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభి స్తోందన్నారు.  రాబోవు  రోజుల్లో  వైసీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్ప డం ఖాయమన్నారు.  కార్యక్రమంలో మాజీ సింగల్‌విండో అధ్యక్షుడు కోసూరి రమేష్‌, డిష్‌ బ్రదర్స్‌, చాను, కువైట్‌ సయ్యద్‌బాషా, షబ్బీర్‌, తాహీర్‌, యూసుఫ్‌, జంషీద్‌, సాదిక్‌, జావీద్‌, కలందర్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

కలకడలో: వైసీపీ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనలో అనేక మైనా రిటీ పథకాలకు కోతలు విధించిందని మండల టీడీపీ మైనారిటీ నాయ కులు విమర్శించారు. శని వారం కలకడ టీడీపీ కార్యా లయంలో సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రంజాన్‌ తోఫా, కార్పొరేషన్‌ రుణాల మంజూరును ప్రభుత్వం కాలరాసిందన్నారు. తాజాగా దుల్హన్‌ పథకానికి నిధులు లేవని చేతులు ఎత్తేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకకులు కరీముల్లా, మునాఫ్‌, జిలానీ, నౌషాద్‌, జఫార్‌ హుస్సేన్‌, ఖాజా,  రఫీ తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

ములకలచెరువు, జూన్‌ 25: మైనార్టీల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొది లేసిందని జనసేన మండల కన్వీనర్‌ సాయినాథ్‌ ఆరోపించారు. శనివా రం ములకలచెరువులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ..ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్‌ ప్రభు త్వం వైపల్యం చెందిందన్నారు.  వైసీపీ ప్రభుత్వం దుల్హన్‌ పథకం ద్వారా రూ.లక్ష ఇస్తామని చెప్పి జగన్‌ మాట తప్పారన్నారు. మైనార్టీల పథకాల ను అమలు చేయాలని, జగన్‌ బహిరంగ క్షమాపణ చెప్పాల న్నారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌, నేతలు బావాజాన్‌, షోరూం సూరి, సీనియర్‌ నాయకులు నరసింహులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-26T05:21:27+05:30 IST