ఎంఎస్ఎంఈలకు బకాయి..రూ.5 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2020-05-26T10:36:29+05:30 IST

పలు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ పరిశ్రమలు అన్నీ కలిసి ఎంఎ్‌సఎంఈలకు రూ.5 లక్షల కోట్లకు పైబడి

ఎంఎస్ఎంఈలకు బకాయి..రూ.5 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ పరిశ్రమలు అన్నీ కలిసి ఎంఎ్‌సఎంఈలకు రూ.5 లక్షల కోట్లకు పైబడి బకాయి ఉన్నాయని, ఆ సొమ్మంతా వారి వద్ద ఇరుక్కుపోయి ఉందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లోగా ఈ బకాయిలు చెల్లిస్తాయని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రప్రభుత్వాల సారథ్యంలోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా బకాయిలు చెల్లించేలా చూడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్టు ఆయన చెప్పారు. 


రుణపరపతి అందించడంలో కీలక పాత్ర పోషిం చే విధంగా ఎన్‌బీఎ్‌ఫసీలను మరింత పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం ఒక స్కీమ్‌ రూపొందించిందని ఆయన అన్నారు. ఎంఎ్‌సఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పడాన్ని ప్రోత్సహించేందుకు అందులో ‘గ్రామీణ పరిశ్రమలు’ అనే అనుబంధ విభాగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు గడ్కరీ చెప్పారు. 

Updated Date - 2020-05-26T10:36:29+05:30 IST