Abn logo
Feb 25 2021 @ 00:25AM

కల చెదిరినా కలత పడలేదు!

స్టేజీ డ్యాన్సర్‌గా రంగులమయంగా ఉండే ఆమె జీవితం లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా కలచెదరినట్టు అనిపించింది. చీకూ చింతా లేకుండా గడిచిన జీవిత ం కాస్త కష్టాలమయం అయింది. అలాగని ఆమె అధైర్యపడలేదు. కొత్త దారి చూసుకున్నారు. కాలం కలిసొచ్చే దాకా అనువైన పనిలో ఇమిడిపోయారు స్మితా సోని. ఇంటివద్ద సబ్బులు, సౌందర్య ఉత్పత్తులు తయారుచేసి, వాటిని సాయంత్రం వీధుల్లో అమ్ముతూ బతుకు పుస్తకాన్ని అందంగా మలచుకుంటున్న స్మిత విశేషాలివి...


గత పదమూడేళ్లుగా డ్యాన్సే జీవితంగా ఉన్న స్మిత షారుక్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, వరుణ్‌ ధావన్‌ డ్యాన్స్‌ బృందంలో సభ్యురాలు కూడా. స్మిత భర్త సలీం కూడా స్టేజీ డ్యాన్సరే. ఇద్దరూ కలిసి నెలకు లక్ష రూపా యల పైనే సంపాదించేవారు. ఎప్పుడైతే లాక్‌డౌన్‌ మొదలైందో సినిమాలు ఆగిపోయాయి. దాంతో సినిమా అవార్డుల ఫంక్షన్లకు స్టేజీ డ్యాన్సర్‌గా అందరినీ అలరించే స్మిత దంపతులకు రెక్కలు విరిగినంత పనైంది. అప్పటికే వారికి ఒక బాబు.


కరోనా సమయంలో ఇద్దరికీ పైసా పని లేదు. కానీ ఇంటి ఖర్చులకు, నెలనెలా కారు ఈఎంఐ కట్టడానికి, బాబు అవసరాలకు డబ్బులు కావాలి. ‘‘మంచి రోజుల కోసం చూస్తూ ఉండడం కన్నా మేము ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి. మెటర్నిటీ సెలవుల్లో ఉన్నప్పుడు నేను ఆర్గానిక్‌ బ్యూటీ ఉత్పత్తుల మీద ఒక వర్క్‌షాపు నిర్వహించాను. ఈ కష్టకాలంలో నా కుటుంబాన్ని గట్టెక్కిం చేందుకు సబ్బులు, సౌందర్య సాధనాలను ఎందుకు తయారుచేయకూడదు! అనే ఆలోచన వచ్చింది’’ అంటారు స్మిత. 


సొంత కారునే మొబైల్‌ షాపుగా

ఆలోచిస్తూ కూర్చుంటే కష్టాలు కడతేరవని తెలిసిన స్మిత వెంటనే అందుకు కావాల్సిన సామగ్రి తెచ్చుకొన్నారు. యూట్యూబ్‌ వీడియోలు చూసి ప్యాకింగ్‌, లేబిలింగ్‌ నైపుణ్యం సాధించారు. మొదటగా తాను తయారుచేసిన సబ్బులు, సౌందర్య ఉత్పత్తులను తన స్నేహితులు, కుటుంబసభ్యులకు ఇచ్చారు. వారు బాగున్నాయని చెప్పడంతో వాటిని మార్కెట్‌ చేయాలనుకున్నారు. సబ్బులు, ఫేస్‌వాష్‌, హెయిర్‌ ఆయిల్స్‌ను అమ్మేందుకు తమ కారునే మొబైల్‌ షాపుగా మార్చేశారు స్మిత.  

కారు వెనక భాగంలో వాటిని వరుసగా పేర్చి ముంబయిలోని లోకండ్వాలా మార్కెట్‌, ఆంధే రి ప్రాంతాల్లో ప్రతి రోజూ సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు అమ్ముతారామె. ఆమె భర్త సలీం వారి 11 నెలల బాబును చూసుకుంటూ ఆమెకు సహకరిస్తున్నారు. మొదట్లో ఆమె ఉత్పత్తులను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. అయితే స్మిత తన ఉత్పత్తులు హాని చేయవని, ఆరోగ్యాన్ని పెంచుతాయని వివరించడంతో క్రమంగా కొనేవారు పెరిగారు. ఇప్పుడు స్మిత నెలకు 30 వేలు సంపాదిస్తున్నారు. ప్రతి కష్టం మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుందని నమ్మడమే కాదు గడ్డు పరిస్థితులకు వెరవకుండా ముందుకు సాగుతూ జీవితాన్ని గెలుస్తున్నారు స్మిత.సబ్బులు, ఫేస్‌వాష్‌, హెయిర్‌ ఆయిల్స్‌ను అమ్మేందుకు తమ కారునే మొబైల్‌ షాపుగా మార్చేశారు స్మిత.  కారు వెనక భాగంలో వాటిని వరుసగా పేర్చి ముంబయిలోని లోకండ్వాలా మార్కెట్‌, ఆంధే రి ప్రాంతాల్లో ప్రతి రోజూ అమ్ముతుంటారు.


Advertisement
Advertisement
Advertisement