డబుల్ బెడ్ రూమ్ పథకం.. రోజుకో వివాదం.

ABN , First Publish Date - 2022-07-06T16:48:12+05:30 IST

ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన మహిళలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించారు.

డబుల్ బెడ్ రూమ్ పథకం.. రోజుకో వివాదం.

మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకం రోజుకో వివాదానికి దారితీస్తోంది. ఇళ్ళు మంజూరయ్యి చేతికందని లబ్దిదారులు ఇంటి తాళాలు పగుల గొట్టి గృహప్రవేశాలు చేస్తుంటే, అర్హత ఉన్నాఇళ్ళు అందని లబ్దిదారులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన మహిళలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో  చేర్చగా వీరిని కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించారు.

ఈ ఇళ్లను అమ్ముకునేందుకు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు, అందుకే గూడు లేని పేదల ఇళ్లను ఆక్రమించుకుంటున్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ళు కేటాయించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ తెలిపారు.

Updated Date - 2022-07-06T16:48:12+05:30 IST