డాక్టర్‌ను సస్పెండ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-06-30T05:17:14+05:30 IST

నవజాత శిశువు మృతి కారణమైన డాక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ధరూర్‌ మండలం జాంపల్లికి చెందిన దీపిక కుటుం బ సభ్యులు బుధవారం జిల్లా ఆసుపత్రి ముందు ధర్నా చేశారు.

డాక్టర్‌ను సస్పెండ్‌ చేయాలి
ఆసుపత్రి ముందు ధర్నా చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

- జిల్లా ఆసుపత్రి ముందు బాధితుల ధర్నా

గద్వాల క్రైం, జూన్‌ 29 : నవజాత శిశువు మృతి కారణమైన డాక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ధరూర్‌ మండలం జాంపల్లికి చెందిన దీపిక కుటుం బ సభ్యులు బుధవారం జిల్లా ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. అంతకుముందు కలెక్టర్‌ శ్రీహర్ష జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తామ బాధను ఆయనకు విన్న వించేందుకు యత్నించారు. కానీ ఆయన పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాధితుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యు లు నిర్లక్ష్యదోరణిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్‌కు సమస్యను తెలిపేందుకు ప్రయత్నించినా పట్టించుకోకుం డా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురుకు గర్భశోకం మిగిల్చిన డాక్టర్‌ నర్మదను వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరారు. లేకపోతే కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కిశోర్‌కుమార్‌ బాధితులతో మాట్లాడారు. శిశువు మృతి చెందిన విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఽధర్నాలో బాధిత కుటుంబ సభ్యులు సత్యమ్మ, అనసూయ, రామన్న, వీరన్న, కిష్టమ్మ, వీరేష్‌ ఉన్నారు.


Updated Date - 2022-06-30T05:17:14+05:30 IST