జిల్లా సమగ్ర అభివృద్ధికి చొరవ చూపాలి

ABN , First Publish Date - 2022-01-21T06:23:46+05:30 IST

మౌలిక వసతులు కల్పించి జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు చొరవ చూపాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అన్నారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన 1, 7వ (ఆర్థిక, ప్రణాళిక, పనుల) స్థాయీ సంఘం సమావేశం

జిల్లా సమగ్ర అభివృద్ధికి చొరవ చూపాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ సందీప్‌ రెడ్డి

స్థాయీ సంఘం సమావేశంలో జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి 

భువనగిరి రూరల్‌, జనవరి 20: మౌలిక వసతులు కల్పించి జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు చొరవ చూపాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అన్నారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన 1, 7వ (ఆర్థిక, ప్రణాళిక, పనుల) స్థాయీ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రహదారుల పునర్నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాకేంద్రానికి సమీపంలో గల వడపర్తి, చీకటిమామిడి రహదారి గుంతలమయంగా మారిందని 15 రోజుల్లోగా మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ ఈఈ శంకరయ్యను ఆదేశించారు. అలాగే జిల్లావ్యాప్తంగా ధ్వంసమైన రహదారులు, లింకురోడ్లకు, రహదారి మధ్యలో శిథిలావస్థలో చేరిన కల్వర్టు నిర్మాణ పనులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. జిల్లాలో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూ.18కోట్లు కేటాయించిందని తెలిపారు. ఆ నిధులతో విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్‌, తుర్కపల్లి మండలం వాసాలమర్రి, యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గత సంవత్సరం 5,645 మంది రైతులు నూతన ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకుంటే, ఇప్పటివరకు 3,264 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామని, ట్రాన్స్‌కో డీఈ మల్లికార్జున్‌గౌడ్‌ తెలిపారు. ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు అందించేలా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మిషన్‌ భగీరథ ఈఈ డి లక్ష్మణ్‌ సూచించారు. అదే విధంగా 2వ(గ్రామీణ అభివృద్ధి) స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఉపాధి హామీ పనులను నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమల శాఖ పని తీరు, దేవాదాయ శాఖ అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవో బి. శ్రీనివా్‌సరావు, జడ్పీటీసీలు పల్లా వెంకట్‌రెడ్డి, గోరుపల్లి శారద, కోట పుష్పలత, జిల్లాస్థాయి అధికారులు కె. గిరిధర్‌, సాహితి, ధనుంజయ, విజయ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T06:23:46+05:30 IST