స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి

ABN , First Publish Date - 2021-12-03T05:15:49+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి
అవార్డును అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి

  • రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

( ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌ను స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మేడ్చల్‌ జిల్లాను అన్ని జిల్లాల కంటే ముందుంచాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్‌ కలెక్టరేట్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌పై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీ్‌షతోపాటు కార్పొరేషన్‌, మునిసిపాలిటీల ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని కార్పొరేషన్‌, మునిసిపాలిటీల్లో వెజ్‌, నాజ్‌వెజ్‌ మార్కెట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అదేశించారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వైకుంఠధామాలు పూర్తి కాలేదని తెలిసిందని, వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో అందరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునే విధంగా ప్రజాప్రతినిధులు చైతన్యం చేయాలని మంత్రి అన్నారు. బోడుప్పల్‌, పీర్జాదిగూడలో రూ.110 కోట్లతో చేపట్టిన పార్కులు, చెరువులు ఇతర పనులు పూర్తి అయ్యాయని, ఇదేతీరులో మిగిలిన మునిసిపాలిటీల్లో పనులను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఘట్‌కేసర్‌, నిజాంపేట మునిసిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వారికి అవార్డులను అందించారు. ప్రజాప్రతినిధులు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ మాట్లాడుతూ అందరూ సమన్వయంతో ముందుకు సాగితే అభివృద్ధి జరుగుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్‌ శాంసన్‌, ఆర్డీఓ మల్లయ్య మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T05:15:49+05:30 IST