జిల్లాలో 17.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు

ABN , First Publish Date - 2022-08-10T06:56:10+05:30 IST

జిల్లాలో ఎడ తెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తం గా మంగళవారం సైతం పలుచోట్ల భారీ వర్షం కు రిసింది. జిల్లా వ్యాప్తంగా 17.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం అత్యధికంగా దిలావర్‌పూర్‌ మండలంలో 33.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది

జిల్లాలో 17.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు

నిర్మల్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎడ తెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తం గా మంగళవారం సైతం పలుచోట్ల భారీ వర్షం కు రిసింది. జిల్లా వ్యాప్తంగా 17.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం అత్యధికంగా దిలావర్‌పూర్‌ మండలంలో 33.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని మూడు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం సా మర్థ్యం 1183 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1180.8 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.484 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.252 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 1400 క్యూసెక్కు ల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఒక వర ద గేటు ఎత్తి 1800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తి స్థా యి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 357.70 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.852 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1.366 టీఎం సీల నీరు నిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల కు 2500 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు వరద గేటును ఎత్తి 2500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతు న్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మ ట్టం 685.425 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు కా గా ప్రస్తుతం 4.383 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షా లకు కడెం ప్రాజెక్టులోకి 7058 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా ప్రాజెక్టు ఒక వరద గేటును ఎత్తి 2072 క్యూసెక్కుల నీరు దిగువన గల గోదావరిలోకి వెళ్తుంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రం సహాపలు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయవుతున్నాయి. భారీ వర్షాలకు జిల్లా ప్రజానికం ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-08-10T06:56:10+05:30 IST