ఉద్యాన పంటల సాగులో జిల్లా ప్రథమం

ABN , First Publish Date - 2021-10-19T05:06:59+05:30 IST

ఉద్యానవన పంటల సాగులో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఉద్యానవన శాఖ సూక్ష్మ సేద్య పథకం డిప్యూటీ డైరెక్టర్‌ విజయలక్ష్మీ తెలిపారు.

ఉద్యాన పంటల సాగులో జిల్లా ప్రథమం
ఉద్యానవన పంటలను పరిశీలిస్తున్న డిప్యూటీ డైరెక్టర్‌ విజయలక్ష్మీ

డిప్యూటీ డైరెక్టర్‌ విజయలక్ష్మీ

బోనకల్‌/చింతకాని, అక్టోబరు 18: ఉద్యానవన పంటల సాగులో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఉద్యానవన శాఖ సూక్ష్మ సేద్య పథకం డిప్యూటీ డైరెక్టర్‌ విజయలక్ష్మీ తెలిపారు. మండలంలోని బ్రాహ్మాణపల్లి, ముష్టికుంట్ల గ్రామాల్లో సాగు చేస్తున్న ఉద్యానవన పంటలను సోమవారం ఆమె పరిశీలించారు. రెండు సంవత్సరాలల్లో మంజూరైన డ్రిప్‌, స్పింకర్ల యూనిట్లను తనిఖీ చేశారు. జామ, మామిడి, ఆయిల్‌పామ్‌, కూరగాయలు, డ్రాగన్‌ ప్రూట్‌ పంటల సాగుకు సంబందించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూక్ష్మ సేద్య పథకం ద్వార మంజూరైన యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యానవన పంటల సాగు రైతులు అదిక దిగుబడులతో పాటు లాభసాటిగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడిని ఉపయోగించుకుని రైతులు ఉద్యాన పంటల పై మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంరలో జిల్లా ఉద్యానవనశాఖ అధికారిణీ అనసూయ, డివిజన్‌ అధికారి ఆకుల వేణు, నాగమణీ, బార్గవి, నాగేశ్వరావు పాల్గొన్నారు.

చింతకాని: ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతులకు సూక్షసేద్యం వరప్రదాయనని సూక్ష సేద్య రాష్ట్ర ప్రత్యేక అధికారి కుమారి విజయలక్ష్మీ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని వందనం, నరసింహపురం గ్రామాల్లో 2018-19, 19-20 సంవత్సరాల్లో రైతులకు మంజూరైన డ్రిప్‌,స్పింకర్ల యూనిట్లు పరిశీలించారు. సూక్ష సేద్యం, ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి  జీ అనసూయ మధిర ఉద్యాన అధికారి ఆకుల వేణు,సూక్ష సేధ్య పథక ఇంజనీర్‌ పి నాగమణి, డ్రిప్‌ కంపెనీల ప్రతినిధులు,రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T05:06:59+05:30 IST