బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్‌ విజయవంతం

ABN , First Publish Date - 2022-08-07T05:51:02+05:30 IST

ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఎన్‌వోసీ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్న టీఆర్‌ఎస్‌ వైఖరిని నిరసనగా శనివారం బీజేపీ ఆదిలాబాద్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.

బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్‌ విజయవంతం

ఆదిలాబాద్‌అర్బన్‌,ఆగస్టు6: ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఎన్‌వోసీ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్న టీఆర్‌ఎస్‌ వైఖరిని నిరసనగా శనివారం బీజేపీ ఆదిలాబాద్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు వ్యాపారులు, విద్యా సంస్థలు, స్థానికులు, రవాణా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్ధతు తెలుపగా తెరిచిన దుకాణాలు వ్యాపార సంస్థలను బీజేపీ నాయకులు మూసి వేశారు. దీంతో పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పాయలశంకర్‌ మాట్లాడుతూ ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌ను అడ్డుకునేందుకు పోలీసులు బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు ఎన్‌వోసీ ఇవ్వమని ఉత్తరాలు రాసినా ఇప్పటి వరకు స్పందించట్లేదని ఎక్కడ బీజేపీకి క్రెడిట్‌ వస్తుందోనన్న ఉద్దేశంతో జిల్లాకు అన్యాయం చేస్తున్నారన్నారు. జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితే పారిశ్రామిక అభివృద్ధి, ఖనిజ, పరిశ్రమలు, కాటన్‌ పరిశ్రమలు, అభివృద్ధి బాటలో సాగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు లాలామున్న, జోగురవి, దినేష్‌ మటోలియా, లోక ప్రవీన్‌రెడ్డి, జీవి రమణ, సుమరవి, నాయకులు, కార్యకర్తలున్నారు.

Updated Date - 2022-08-07T05:51:02+05:30 IST