నియంత పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2022-06-28T06:57:58+05:30 IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగిస్తున్న నియంతపాలనకు చరమగీ తం పాడాలని టీడీపీ మహిళా విభాగం రా ష్ట్ర అధ్యక్షురాలు ప్రొ ఫెసర్‌ టి.జ్యోత్స్న, న ల్లగొండ పార్లమెంట్‌ అధ్యక్షుడు నెల్లూరి దుర్గాప్రసాద్‌ అన్నారు.

నియంత పాలనకు చరమగీతం పాడాలి
సమావేశంలో మాట్లాడుతున్న జ్యోత్స్న

చింతపల్లి, జూ న 27: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగిస్తున్న నియంతపాలనకు చరమగీ తం పాడాలని టీడీపీ మహిళా విభాగం రా ష్ట్ర అధ్యక్షురాలు ప్రొ ఫెసర్‌ టి.జ్యోత్స్న, న ల్లగొండ పార్లమెంట్‌ అధ్యక్షుడు నెల్లూరి దుర్గాప్రసాద్‌ అన్నారు. సోమవారం మండలంలోని కుర్మేడు, చింతపల్లి గ్రామా ల్లో నిర్వహించిన పార్టీ సభ్యత్వ  నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వ చ్చిన టీఆర్‌ఎస్‌ వారి సమస్యలను పరిష్కరించడంలో, ఎన్నికల హామీలను అమ లు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకో, దాచుకో పథకాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వం  విఫలమైందని పేర్కొన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఇనచార్జి విజయ్‌నాయక్‌, రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎన.ప్రసాద్‌, నాయకులు వస్కుల కృష్ణయ్య, వై.రవీందర్‌గౌడ్‌, అమరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, రమేష్‌, యాదయ్య, ఆనంద్‌, యాదగిరి, శ్రీనివాస్‌, ఆర్‌.వెంకటేశ్వర్లు, యాదగిరిచారి పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T06:57:58+05:30 IST