ఈ ఏడాదిలోనే అభివృద్ధి పనులు పూర్తి

ABN , First Publish Date - 2021-06-13T06:38:36+05:30 IST

తిరుపతి రైల్వేస్టేషన్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ ఏడాది చివరిలోపే పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్యా వెల్లడించారు.

ఈ ఏడాదిలోనే అభివృద్ధి పనులు పూర్తి
ఆర్సీ గేటు వద్ద పనులను పరిశీలిస్తున్న గజానన మాల్యా

రైల్వే జీఎం గజానన మాల్యా 

తిరుపతి(ఆటోనగర్‌), జూన్‌ 12: తిరుపతి రైల్వేస్టేషన్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ ఏడాది చివరిలోపే పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్యా వెల్లడించారు. శనివారం ఆయన ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వద్ద నిర్మాణంలోని ఫ్లై ఓవర్‌, ఆర్సీ గేటు అండర్‌పాస్‌, తిరుపతి ప్రధాన రైల్వేస్టేషన్‌ ఆరో నెంబరు ప్లాట్‌ఫారం పనులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఆర్సీ గేటు వద్ద అండర్‌పాస్‌ పనులు ఆగస్టులో పూర్తవుతాయన్నారు. నగర పరిధిలో చేపట్టాల్సిన పనులను మున్సిపల్‌ అధికారులకు వివరిస్తామన్నారు. నిధులు సకాలంలో మంజూరు కాని కారణంగా ఆరో నెంబరు ప్లాట్‌ఫారం పనులు ఆలస్యమవుతున్న విషయం వాస్తవమే అన్నారు. అయినా సెప్టెంబరులోపే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తిరుచానూరు రైల్వేస్టేషన్‌లో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పనులన్నీ ఈ ఏడాది చివరిలోపు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక్కడ రైళ్లను హాల్ట్‌ చేయనుండటంతో అదనపు ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు డివిజన్‌ మేనేజర్‌ అలోక్‌ తివారి, సీనియర్‌ డీసీఎం ప్రశాంత్‌కుమార్‌, ఏడీఈ రాఘవేంద్రశర్మ, పుష్పరాజ్‌, స్టేషన్‌ డైరెక్టర్‌ కుప్పాల సత్యనారాయణ, ఎస్‌ఆర్‌ఎం రాజేంద్రప్రసాద్‌, అధికారులు రామ్మోహన్‌రావు, నాగిరెడ్డి, హేమ్‌రాజ్‌ మీన తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-13T06:38:36+05:30 IST