గ్రామాల అభివృద్ధి సమష్టి బాధ్యతగా గుర్తించాలి

ABN , First Publish Date - 2022-01-22T06:01:03+05:30 IST

గ్రామాల అభివృద్ధిని ప్రజా ప్రతినిధులు సమష్టి బాధ్యతగా గుర్తించాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు.

గ్రామాల అభివృద్ధి సమష్టి బాధ్యతగా గుర్తించాలి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న జడ్పీ చైర్మన్‌ మధు

- జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు 

రామగిరి, జనవరి 21: గ్రామాల అభివృద్ధిని ప్రజా ప్రతినిధులు సమష్టి బాధ్యతగా గుర్తించాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. మండలంలోని రాజా పూర్‌లో సర్పంచ్‌ పాశం ఒదేలు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు హాజరయ్యా రు. సింగరేణి డీఎమ్‌ఎఫ్‌టీ రూ.43లక్షల నిధులతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉందన్నారు. మండల ప్రజాప్రతినిధులు సమష్టిగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సర్పంచ్‌లకు అభినందనలు తెలిపారు. కేక్‌ను కట్‌ చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క, జడ్పీటీసీ మ్యా దరవేని శారద, వైస్‌ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు శంకేషి రవీం దర్‌, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు ప్రజాప్రతినిధు లు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T06:01:03+05:30 IST