పేద ప్రజల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-27T06:32:08+05:30 IST

పేద ప్రజల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి మండలం లోని అప్పన్నపేట, రాఘవపూర్‌ గ్రామాల్లో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదా రులకు నూతన రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు.

పేద ప్రజల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
జూలపల్లిలో కొత్తరేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

పెద్దపల్లి రూరల్‌ , జూలై 26 : పేద ప్రజల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి మండలం లోని అప్పన్నపేట, రాఘవపూర్‌ గ్రామాల్లో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదా రులకు నూతన రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ రేషన్‌ కార్డు దారుల కు ఇటీవలే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రతి పేదవారితో పాటు, హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ కడపునిండా భోజనం చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్‌ ప్రతి ఒక్కరికీ 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. వీటితో పాటు అనేక సంక్షేమ పథకా లు ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్రవంతి, జడ్పీ టీసీ రామ్మూర్తి, అప్పన్నపేట సింగిల్‌ విండో చైర్మన్‌ దాసరి చంద్రారెడ్డి, తహసీ ల్దార్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాజ నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

జూలపల్లి :  అన్నివర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు  కేటాయిస్తోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే దాసరి మనోహ ర్‌రెడ్డి కొత్త రేషన్‌కార్డులను, కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా  అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మీనర్సయ్య, మార్కెట్‌ చైర్మన్‌ కంది చొక్కారెడ్డి, విండో చైర్మెన్‌ లు కొంజర్ల వెంకటయ్య, పుల్లూరి వేణుగోపాల్‌రావు, తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపీడీఓ వేనుగోపాల్‌రావు, సర్పంచులు దారబోయిన నర్సింహాయాదవ్‌ మేచి నేని సంతోష్‌రావు, నాయకులు కంకనాల జ్యోతిబసు, సొల్లు స్యాం, మారుపాక కుమార్‌ తదితరులు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:32:08+05:30 IST