అన్నివర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-29T04:55:50+05:30 IST

అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని మక్తల్‌ ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

అన్నివర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
పరమేశ్వరస్వామి చెరువులో చేప పిల్లలు వదులుతున్న ఎమ్మెల్యే చిట్టెం

మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 

పరమేశ్వరస్వామి చెరువులో చేప పిల్లలు వదిలివేత 


ఆత్మకూరు, అక్టోబరు 28: అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని మక్తల్‌ ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని పరమేశ్వరస్వామి చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. గంగపుత్రుల అభివృద్ధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో చేపలను వదులుతోందని తెలి పారు. పట్టణ కేంద్రంలో సుమారు 250కి పైగా మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయని, వారి అభి వృద్ధి కోసం పరమేశ్వరస్వామి చెరువులో 36వేల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. కార్యక్రమంలో వన పర్తి జిల్లా మత్స్య శాఖ అధికారి రహమాన్‌, ముని సిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రి, వైస్‌ చైర్మన్‌ విజయ భాస్కర్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కోటేష్‌, మత్స్యకార్మిక సంఘం మండల అధ్యక్షుడు అశ్వినికుమార్‌, తహసీ ల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్‌, వార్డు కౌన్సి లర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


రామన్‌పాడు రిజర్వాయర్‌లో రొయ్య పిల్లలు విడుదల


మదనాపురం : మండలంలోని గోపన్‌పేట శివా రులోని రామన్‌పాడు రిజర్వాయర్‌లో లక్షా 60వేల రొయ్య పిల్లలను గురువారం జడ్పీటీసీ సభ్యుడు కృష్ణయ్యయాదవ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య సంపద పెంపొందిం చుకునేందుకు ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలతో పాటు, అమ్ముకోవ డానికి వీలుగా  వాహనాలను కూడా అందజేస్తోం దని అన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్‌,  పార్టీ మండల అధ్యక్షుడు బిట్లియాదగిరి, సర్పంచులు కురుమూర్తి, రాంనారాయణ, ఆంజనేయులుయాదవ్‌, కోఆప్షన్‌ సభ్యులు చాంద్‌పాష పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T04:55:50+05:30 IST