రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2020-09-26T11:00:22+05:30 IST

రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోం దని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తెలిపారు.

రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ 

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ


తిమ్మాపూర్‌, సెప్టెంబరు 25: రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోం దని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తెలిపారు. రాష్ట్రంలో  సీఎం కేసిఆర్‌ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చినందుకు కృతజ్ఞతగా మానకొం డూర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, రై తులు, భారీ ఎత్తున ట్రాక్టర్లతో మానకొండూర్‌ ఎ మ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అలుగునూర్‌ కూడ లి వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. సీఎం కేసిఆర్‌ చిత్రపటనికి క్షీరాభిషే కం నిర్వహించి ట్రాక్టర్‌ నడుపుతూ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చినం దుకు  ముఖ్యమంత్రి కేసిఆర్‌కు రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.


మానకొండూర్‌ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  50మందికి పైగా పోలీసులు బందోబస్తు ని ర్వహించి ట్రాఫిక్‌ను క్రమబద్ధ్దీకరించారు. కార్యక్ర మంలో సుడా చైర్మన్‌ జి.వి. రామకృష్ణారావు, కరీంనగ ర్‌ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తిరుప తి, తిమ్మాపూర్‌ ఎంపీపీ కేతిరెడ్డి వనిత, మండల స ర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఇనుకొండ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర ఇఫ్‌కో డైరెక్టర్‌ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ప్రజాప్ర తినిధులు, రైతులు పాల్గొన్నారు.


జమ్మికుంట: ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు ఆధ్వ ర్యంలో 300ట్రాక్టర్లతో శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అయ్యప్ప దేవాలయం నుంచి స్థానిక గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.  అ నంనతరం సీఎం కేసిఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గాంధీ చౌరస్తాలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దేశిని స్వప్న-కోటి, జమ్మికుంట ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘం చైర్మన్‌ పొనగంటి సంప త్‌, ఎంపీపీ దొడ్డె మమత, జట్పీటీసీ డాక్టర్‌ శ్రీరామ్‌ శ్యామ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీని వాస్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-26T11:00:22+05:30 IST