వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరాలు రిజిస్టర్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-12-03T06:23:03+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతీ ఒక్కరి వివరాలు కొవిన్‌ యాప్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలని కలెక్టర్‌ గుగులో తు రవి నాయక్‌ అన్నారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరాలు రిజిస్టర్‌ చేయాలి
వెబ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ రవి

- కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతీ ఒక్కరి వివరాలు కొవిన్‌ యాప్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలని కలెక్టర్‌ గుగులో తు రవి నాయక్‌ అన్నారు. గురువారం కొవిడ్‌ వ్యా క్సినేషన్‌ విధానంపై వైద్య అధికారులు, మేడిపల్లి, పెగడపల్లి, మెట్‌పల్లి, మల్యాల మండల సర్పంచ్‌ లు, పంచాయతీ సెక్రటరీలతో జూమ్‌యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 20 వేల మందికి కొ విడ్‌ మొదటి డోసు వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. వారందరికి వ్యాక్సిన్‌ ఇప్పించడంలో అధికారులు, ప్ర జాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలన్నారు. గ్రా మంలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కొవిడ్‌ వ్యా క్సిన్‌ తీసుకొని కొవిన్‌ యాప్‌లో నమోదు కాని వారి ని గుర్తించి వారి ద్వారా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఆ ధారాలను పరిశీలించి వివరాలను రిజిస్టర్‌ చేయాల న్నారు. వివిధ ప్రచార సాధనాల ద్వారా వింటున్న ఓమైక్రాన్‌ వైరస్‌ ప్రభావం ప్రస్తుతం మన దగ్గర లేనప్పటికీ, కరోనా మొదటి విడతలో పాటించిన విధంగా మాస్కులు ధరించడం, సామాజిక దూరా న్ని పాటించడం, విదేశాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్‌ పాటించడం వంటి జాగ్రత్తలు చే పట్టాలన్నారు. జిల్లాలో ప్రతీ ఒక్కరికి రెండో డోసు వ్యాక్సిన్‌ అందించాలన్న లక్ష్యంగా ప్రారంభించిన స్పె షల్‌ డ్రైవ్‌ కార్యక్రమం ద్వారా గ్రామాలలో ఎంత మందికి వ్యాక్సిన్‌ ఇవ్వడం జరిగింది, ఇంకా వ్యాక్సిన్‌ ఎంత మందికి ఇవ్వాలి, వ్యాక్సిన్‌ పొంది పోర్టల్‌లో రిజిస్టర్‌ కాని వివరాలను డోర్‌ టు డోర్‌ సర్వే ద్వారా గుర్తించాలన్నారు. ఓటరు జాబితా ఆధారంగా వ్యా క్సిన్‌ అందించేలా చూస్తామని, ఓటరు జాబితాలో పేర్లు లేని 18 ఏళ్లు నిండి ఓటరుగా నమోదు కాని వారిని, వ్యవసాయం, వ్యాపారం, ఇతర పనులు ని మిత్తం వచ్చిన వారిని గుర్తించి వ్యాక్సిన్‌ అందించా లన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదన పు కలెక్టర్‌ అరుణ శ్రీ, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పి శ్రీధర్‌, ఎంపీడీఓలు, మేడిపల్లి, పెగడపల్లి, మెట్‌పల్లి, మల్యాల మండలాల సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T06:23:03+05:30 IST