రాష్ట్రంలో విద్యావ్యవస్థ సర్వనాశనం

ABN , First Publish Date - 2021-10-20T05:06:44+05:30 IST

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ సర్వనాశనమైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మ ల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థ సర్వనాశనం

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 19 : వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ సర్వనాశనమైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూళ్లకు వెళ్తారో వారందరికి అమ్మఒడి పఢకం కింద తల్లి ఖాతాలో రూ.15వేలు వేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట మార్చేసి, ఒకరికే అ మ్మఒడి పథకం అని చెప్పి సీఎం జగన్‌ ప్రజలను దగాచేశారన్నారు. ఇపుడు ఒక సంవత్స రం అమ్మఒడి పథకం ఎత్తేసేందుకు పథకం వేసి, జనవరిలో కాకుండా జూన్‌లో అమ్మఒడి డబ్బులు తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పడం ముమ్మాటికి మోసమే అన్నారు. జగన్‌ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యావ్యవస్థ దయనీయమైన స్థితిలోకి చేరిందన్నారు. జనవరిలో జమ చేయాల్సిన సొమ్ము జూన్‌ మార్చ డం వెనుక పెద్ద తిరకాసే ఉందన్నారు. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పా ఠశాలల్లో, కళాశాలల్లో ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, ప్రైవేట్‌ ఎ యిడెడ్‌ స్కూల్స్‌, కాలేజీలను మూసేందుకు జగన్‌ సర్కార్‌ ముందుకు పోతుందన్నా రు. ఎలిమెంటరీ స్కూళ్లను అప్పర్‌ప్రైమరీ స్కూల్స్‌ కలిపేసి, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీనే లేకుండా చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పేద మెరి ట్‌ విద్యార్థులను బెస్ట్‌ అవెలబుల్‌ స్కూళ్ల లో చేరి చదువుకునేందుకు అవకాశం కల్పించిందని, ఇందు కోసం ఏడాదికి రూ.300 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశా రు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు. టీడీపీ నాయకులు ఏసుదాసు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T05:06:44+05:30 IST