పేదల ఇల్లు కూలిస్తే తీవ్ర పరిణామం తప్పదు

ABN , First Publish Date - 2022-05-21T04:45:06+05:30 IST

పేదల ఇల్లు కూలి స్తే తీవ్ర పరిణామం ఎదుర్కోక తప్పదని అఖిల పక్ష నేతలు హెచ్చరించారు.

పేదల ఇల్లు కూలిస్తే తీవ్ర పరిణామం తప్పదు
అఖిలపక్ష నేతల ధర్నాలో మాట్లాడుతున్న లింగారెడ్డి

అఖిలపక్షం నేతలు

కడప(ఎర్రముక్కపల్లి), మే 20: పేదల ఇల్లు కూలి స్తే తీవ్ర పరిణామం ఎదుర్కోక తప్పదని అఖిల పక్ష నేతలు హెచ్చరించారు. కడప నగరం ఎన్టీఆర్‌ నగర్‌లో శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ 40 ఏళ్లగా నివాసముంటున్న పేదల ఇళ్లు కూల్చడం సరికాన్నా రు. వైసీపీ నేతలు సొంత ప్రయోజనాల కోసం పే ద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు గూడు లే కుండా చేయడం అన్యాయమన్నారు.

అన్న క్యాంటీన్లను కూల్చి పేదల కడుపు కొట్టారని ఇప్పుడు పేద ల గృహాలను సైతం పడగొట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రజలు ప్రభుత్వానికి బుద్దిచెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి కడప ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోర్థన్‌రెడ్డి, జి.లక్ష్మిరెడ్డి, బాలకృష్ణయాదవ్‌ (బీజేపీ), బండి జకరయ్య, సత్తార్‌, తిరుమలేష్‌, నాగేంద్ర (కాంగ్రెస్‌), రాము(సీపీఐ), మగ్బూల్‌బాషా(ఆర్‌సీపీ) పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T04:45:06+05:30 IST