Abn logo
Aug 7 2020 @ 00:57AM

‘కడ్తా’ అవకతవకలపై నజర్‌

Kaakateeya

దర్యాప్తునకు సిద్ధ్దమవుతున్న యంత్రాంగం

రికార్డుల పరిశీలనకు కసరత్తు 

సమగ్ర దర్యాప్తు చేయాలని రైతు సంఘాల నాయకుల డిమాండ్‌


నిజామాబాద్‌, ఆగస్టు 6 ( ఆంధ్రజ్యోతి ప్రతిని) : జిల్లాలో యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లలో కడ్తా పేరుతో రైస్‌ మిల్లుల్లో జరి గిన అవకతవకలపై సహ కార శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి దర్యాప్తు చేసేందుకు సిద్ధమ వుతున్నారు. ఈ వ్యవహారంపై కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. సొసైటీల పరి ధిలో ధాన్యం కోనుగోలు సమయంలో చెప్పిన దాని కన్నా కడ్తా ఎక్కు వ తీశారని ఆరోపిస్తున్నా రు. తమకు న్యాయం చేయాలని సావెల్‌ సొసైటీకి చెందిన రైతులు రెండు రోజుల క్రి తం జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేశారు. ఆ ఫి ర్యాదు ఆధారంగా సహకార, పౌరసరఫరాల శాఖ అధి కారులు దర్యాప్తునకు రంగం సిద్ధం చేస్తున్నారు. కొనుగో లు కేంద్రాలలో అమ్మిన ధాన్యానికి, చెల్లించిన డబ్బులకు పొంతనలేదని రైతులు ఫిర్యాదులో పేర్కొనడంతో అధి కారులు రికార్డుల పరిశీలనకు సిద్ధమవుతున్నారు.


రూ.850 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు

జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యా ప్తంగా 295కిపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశా రు. వీటి ద్వారా సుమారు రూ.850 కోట్లకు పైగా విలు వైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల బాం్యకు ఖాతాల లో డబ్బులను జమ చేశారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో కడ్తా పేరున బస్తాకు కిలో నుంచి రెండు కిలోల చొప్పున క్వింటాలుకు నాలుగు నుంచి ఐదు కిలో ల వరకు తరుగు తీశారు. అయితే, కొనుగోలు కేంద్రాల లో చెప్పిన విధంగా కాకుండా రైసు మిల్లులకు వెళ్లిన తర్వాత చెత్త పేరుతో మరికొంత పెంచారు. రైతులకు ట్రాక్‌ షీటును పంపారు. రైస్‌ మిల్లులకు ధాన్యం వెళ్లిన తర్వాత అక్కడి నుంచి వచ్చే షీటు ఆధారంగా సొసైటీ ల నుంచి వివరాలను అప్‌లోడ్‌ చేశారు. ఈ వివరాల ఆధారంగా పౌరసరఫరాల సంస్థ అధికారులు డబ్బుల ను ఖాతాలో జమచేశారు. ఇక్కడే కొంత మంది రైతుల కు తేడా వచ్చింది. డబ్బులు ఖాతాలో తక్కువగా జమ య్యాయి. మెండోర మండలం సావెల్‌ సొసైటీలో తా ము అమ్మిన ధాన్యానికి బ్యాంకు ఖాతాకు వచ్చిన డబ్బు లకు తేడా ఉండటంతో రైతులు అక్కడి సొసైటీ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని వారం క్రితం ధర్నా చేశారు. రెండు రోజుల క్రితం జిల్లా సహ కార అధికారికి ఫిర్యాదు చేశారు. రికార్డులను పరిశీలిం చి తమకు న్యాయం చేయాలని కోరారు.


మిల్లర్లలో ఆందోళన

రైతుల ఫిర్యాదు ఆధారంగా అధికారులు రికార్డుల పరి శీలనకు సిద్ధమవుతుండడంతో మిల్లర్లలో ఆందోళన వ్య క్తమవుతోంది. సావెల్‌ సొసైటీ రైతులు ఫిర్యాదు చేయ గా అక్కడి నేతలు వివాదం సద్దుమణిగేలా ప్రయత్నా లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా ఇతర సొసై టీల రైతులు కూడా బయటికి వస్తే సమస్యలు వస్తా యని ముందే అక్కడి వారితో చర్చిస్తున్నట్లు సమాచా రం. ఇప్పటికే మిల్లర్లు కడ్తా పేరున ఇదే రీతిలో తీశారని ఇతర సొసైటీ పరిధిలోని రైతు సంఘాల నేతలు కూ డా ఆరోపిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు చేయాలని కోరు తున్నారు. 


అధికారులు పట్టించుకోలేదు

యాసంగిలో ఎక్కువ ధాన్యం రావడం, వర్షభ యం తో రైతులను కడ్తా పేరిట మిల్లర్లు ఇబ్బందులు పెట్టినా అధికారులు పటించుకోలేదని కాంగ్రెస్‌ కిసాన్‌ ఖేత్‌ రా ష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి అన్నారు. సొసైటీల వారీగా ద ర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. కడ్తా పేరున రైతు ల నుంచి అప్పుడు తరుగు తీస్తున్నారని తాము ఫిర్యా దు చేసినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు. జిల్లా అధికారులు కడ్తా పేరున జరిగిన దోపిడీపై దర్యాప్తు చే సి రైతులకు న్యాయం చేయాలని కోరారు. 


సమగ్ర దర్యాప్తు చేస్తాం - జిల్లా సహకార అధికారి సింహాచలం 

జిల్లాలోని సావెల్‌ సొసైటీ పరిధిలోని రైతులు ఫిర్యా దు చేసింది వాస్తవమేనని జిల్లా సహకార అధికారి సిం హాచలం తెలిపారు. వారి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. సొసైటీతో పాటు మిల్లులో రికార్డు లు పరిశీలిస్తామన్నారు. రికార్డులు పరిశీలించి దర్యాప్తు తర్వాత రైతులకు వివరాలను చెబుతామన్నారు. 


ప్రభుత్వమే బాధ్యత వహించాలి

మెండోర: ధాన్యం కొనుగోళ్లలో కడ్తా పేరుతో జరిగి న అవకతవకలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి రుయ్యడి రాజేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం మండల కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ, సొసైటీలలో ధాన్యం కొనుగోళ్లలో కడ్తా గోల్‌మాల్‌లో ప్రభుత్వానిదే కీలక పాత్రలా కనిపి స్తోందన్నారు. వారం రోజుల నుంచి రైతులు సొసైటీల వద్ద ఆందోళనలు చేస్తూ సొసైటీ అధికారులను, చైర్మ న్లను ధాన్యం అమ్మిన డబ్బులు తక్కువగా వచ్చాయని నిలదీసినా ఇటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి కానీ, జిల్లా అధి కారులు గానీ స్పందించిన దాఖలాలు లేవని దీన్ని బ ట్టి చూస్తే ఇందులో ప్రభుత్వమే కీలకపాత్ర పోషించి నట్టు కనబడుతోందని ఆరోపించారు. నాడు సొసైటీల ంటే రైతులకు ఉపయోగపడే విధంగా ఉండేవని, నే డు అన్నదాతలు పండించిన పంటల డబ్బులను కూ డా వదలడం లేదని, అధికార పార్టీ నాయకులు ఏ స్థా యికి దిగజారి పోయారో దీన్ని బట్టి అర్థమవుతోంద న్నారు. ఇంత జరిగినా మంత్రి స్పందించకపోవడాన్ని చూస్తుంటే వారి చైర్మన్లు చేసిన తప్పు ఒప్పుకున్నట్టేన ని అన్నారు. తక్షణమే మోసపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయాలని లేని ఎడల రాబో యే రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఉద్య మాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు రాజే శ్వర్‌, లింగారెడ్డి, రమేష్‌, శ్రీనివాస్‌, దేవేందర్‌, శయా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement