కేక్ కట్ చేస్తున్న గల్లా అభిమానులు
డీఆర్ మహల్ థియేటర్‌లో సంబరాలు
తిరుపతి(కొర్లగుంట), జనవరి 21: గల్లా అశోక్ నటించిన తొలి చిత్రం ‘హీరో’ సూపర్ హిట్ అయిందని అభిమానులు యశ్వంత్, ఆనంద్, జ్యోతి, నేహాచౌదరి, జయచంద్ర తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని డీఆర్ మహల్ థియేటర్ ప్రాంగణంలో భారీ కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు. సంక్రాంతి పర్వదినాన విడుదలైన తమ హీరో సినిమా ఇలాగే మరిన్ని రోజులు ఆడాలని, అశోక్‌కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు.