Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఛీ..ఛీ.. ఎదురుగా తండ్రి శవం పెట్టుకుని ఇదేం పాడు పని.. ఓ యువతిని ఏకిపారేస్తున్న నెటిజన్లు..!

ఏ పని చేయడానికైనా ఒక సమయం, సందర్భం అంటూ ఉంటుంది. కొందరు ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తూ.. చివరికి అందరి ముందూ నవ్వులపాలవుతుంటారు. ఇలాగే అమెరికాకు చెందిన ఓ యువతి.. తన తండ్రి మృతదేహం ఎదుట చేసిన పిచ్చి చేష్టలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. తండ్రి చనిపోయారన్న బాధ కూడా లేకుండా ఇలా చేయడమేంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అమెరికాకు చెందిన యువతి తండ్రి చనిపోయాడు. దీనిపై ఆమె మొఖంలో బాధ కూడా కనిపించలేదు. అంతటితో ఆగకుండా తండ్రి శవపేటిక ఎదుట నిలబడి, వివిధ భంగిమల్లో ఫొటోలకు ఫోజులిచ్చింది. అనంతరం ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్, రెడ్డిట్‌లోని గ్రూప్‌లో షేర్ చేసింది. వైరల్ అయిన ఈ ఫొటోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆమెకు హృదయం అంటూ లేదా అని కొందరు అంటుంటే.. పిచ్చిగానీ పట్టలేదుకదా అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే ఆమె ఇలా ఎందుకు చేసిందనే దానిపై వివరణర ఇవ్వలేదు. మొత్తానికి ఈ ఫొటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ యువతి ఫొటోలను తొలగించినట్లు బ్రిటిష్ మీడియా పేర్కొంది. ఆ హ్యాష్‌ట్యాగ్‌తో వెతికినా ఎలాంటి ఫొటో కనిపించలేదని తెలిపింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement