కులాల వారీగా కూలి ఇవ్వాలన్న నిర్ణయం సరికాదు

ABN , First Publish Date - 2021-06-22T06:16:48+05:30 IST

ఉపాధి హామీ కూలీలకు కులాల వారీగా వేతనాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు ములకలపల్లి రాములు అన్నారు.

కులాల వారీగా కూలి ఇవ్వాలన్న నిర్ణయం సరికాదు
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

సూర్యాపేట అర్బన్‌, జూన్‌ 21: ఉపాధి హామీ కూలీలకు కులాల వారీగా వేతనాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు ములకలపల్లి రాములు అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదు ట సోమవారం ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలను ఎస్సీ, ఎస్టీ ఇతర కులాలుగా వర్గీకరించి వేతనాలు చెల్లించాలని కేంద్రం తెచ్చిన మెమో రాజ్యాంగ విరుద్దమన్నారు. గ్రామాల్లో సామాజిక, ఆర్థిక అంతరాలను తగ్గించాలన్న సదుద్దేశంతో తెచ్చిన చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొ డుస్తోందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మోహన్‌రావుకు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి సుందరి కిరణ్‌కుమార్‌లకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పులుసు సత్యం, మట్టిపెల్లి సైదులు, కోట గోపి, బచ్చలకూరి రాంచరణ్‌, తీగల లిం గయ్య, రాములు, మల్లమ్మ, మంజుల, కవిత, సైదులు ఉన్నారు. 

Updated Date - 2021-06-22T06:16:48+05:30 IST