ఎఫ్‌డీఐ పెంపు నిర్ణయం కుట్రపూరితం

ABN , First Publish Date - 2021-02-25T05:23:07+05:30 IST

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం బీమా రంగంలో ఎఫ్‌డీఐని 49 నుంచి 74 శాతానికి పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించడం వల్ల దేశానికి ప్రయోజనం లేదని, దీని వల్ల విదేశీ ఇన్సూరెన్స్‌ కంపెనీలకే లాభమని ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రఘునాధరెడ్డి పేర్కొన్నారు.

ఎఫ్‌డీఐ పెంపు నిర్ణయం కుట్రపూరితం

ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి 

కడప(సెవెన్‌రోడ్స్‌), ఫిబ్రవరి 24: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం బీమా రంగంలో ఎఫ్‌డీఐని 49 నుంచి 74 శాతానికి పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించడం వల్ల దేశానికి ప్రయోజనం లేదని, దీని వల్ల విదేశీ ఇన్సూరెన్స్‌ కంపెనీలకే లాభమని ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రఘునాధరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎల్‌ఐసీ డివిజనల్‌ కార్యాలయం ఎదుట బుధవారం డివిజన్‌ అధ్యక్షుడు అవధానం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు కంపెనీలకు అండగా నిలబడి ప్రభుత్వ బీమారంగాన్ని దెబ్బతీయాలనుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. వెంటనే ఎఫ్‌డీఐ పెంపు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో క్లాస్‌-1 అధికారుల సంఘం నేతలు పరమహంస, చంద్రపాల్‌, క్లాస్‌-2 అధికార సంఘ నేత దీపక్‌, యూనియన్‌ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:23:07+05:30 IST