జాతీయ నూతన విద్యా విధానంపై నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-07-30T05:05:59+05:30 IST

జాతీయ నూతన విద్యా విధానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల లవకుమార్‌ డిమాండ్‌ చేశారు.

జాతీయ నూతన విద్యా విధానంపై నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
డిప్యూటీ డీఈవోకు వినతి పత్రం అందజేస్తున్న ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు

రాయచోటి, జూలై 29: జాతీయ నూతన విద్యా విధానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల లవకుమార్‌ డిమాండ్‌ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎ్‌సఎఫ్‌) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం రాయచోటి పట్టణంలోని డిప్యూటీ డీఈవో రంగారెడ్డికి  వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కూడబలుక్కుని మన ఊరి బడిని మాయం చేసేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ రాయచోటి ఏరియా ఉపాధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, ఏరియా కోశాధికారి తేజశ్రీకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-30T05:05:59+05:30 IST