కరోనా : 16,318..174కు చేరిన మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2020-08-15T10:00:25+05:30 IST

లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నా కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. పాజిటివ్‌ కేసుల నమోదులో పొరుగు జిల్లాల వెంట జిల్లా

కరోనా : 16,318..174కు చేరిన మృతుల సంఖ్య

కడప, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నా కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. పాజిటివ్‌ కేసుల నమోదులో పొరుగు జిల్లాల వెంట జిల్లా అడుగేస్తోంది. వెరశి కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలో 530 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,318కి చేరుకుంది. కడప నగరంలోనే 70 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి ఉన్న ప్రధాన పట్టణాల్లో ఉదయం 11 గంటలకే వాణిజ్య సముదాయాలను క్లోజ్‌ చేస్తున్నా వ్యాధి అదుపులోకి రావడం లేదు. మరో ఆరుగురు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 174కు చేరుకుంది. ఇప్పటి వరకూ 1,89,522 మంది నుంచి శాంపిల్స్‌ను తీసినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం 4,555 మంది నుంచి స్వాబ్‌ నమూనాలు సేకరించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.


జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో 480 ఆక్సిజన్‌ బెడ్లు, 620 నాన్‌ ఆక్సిజన్‌ బెడ్లు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 2 వేల నాన్‌ ఆక్సిజన్‌ బెడ్లు, మొత్తం 3100 బెడ్లు అందుబాటులో ఉండగా 1454 మంది చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. మరో 1646 బెడ్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చి స్వల్ప లక్షణాలు ఉన్నవారు 4,634 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స పొందినట్లు తెలిపింది. కరోనా గురించి సందేహాలుంటే కొవిడ్‌-19 కంట్రోలు రూము నెం.08562-245259, 259179కు ఫోను చేసి నివృత్తి చేసుకోవచ్చని, టెలీ కన్సల్టెంట్‌ కోసం 08562-244070కు ఫోను చేసి వైద్య సలహాలు పొందవచ్చని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. 

Updated Date - 2020-08-15T10:00:25+05:30 IST