ఎన్సీ రామసుబ్బారెడ్డి మరణం తీరని లోటు : వీసీ

ABN , First Publish Date - 2020-05-25T10:28:40+05:30 IST

ఎన్సీ రామసుబ్బారెడ్డి మర ణం జిల్లా సాహిత్య రంగానికి తీరని లోటని వైవీయూ ఉపకులపతి ఆచార్య సూర్యకళావతి పేర్కొన్నారు. .

ఎన్సీ రామసుబ్బారెడ్డి మరణం తీరని లోటు : వీసీ

కడప(కల్చరల్‌), మే 24: ఎన్సీ రామసుబ్బారెడ్డి మర ణం జిల్లా సాహిత్య రంగానికి తీరని లోటని వైవీయూ ఉపకులపతి ఆచార్య సూర్యకళావతి పేర్కొన్నారు. రామసుబ్బారెడ్డి మృతి విషయం తెలుసుకుని వీసీ దిగ్ర్భాంతి చెందారు. కవిగా, కథకుడిగా, నాటక కర్తగా, సాహిత్య సంస్థల క్రియాశీల కార్యకర్తగా ఎన్సీ రామసుబ్బారెడ్డి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకు న్నారన్నారు. వారి మృతి పట్ల సీపీబ్రౌన్‌ భాషా పరిశోధనా కేంద్రం సలహా మండలి చీఫ్‌ ప్యాట్రన్‌, కలెక్టర్‌ హరికిరణ్‌, వైవీయూ కుల అమాత్యులు ఆచా ర్య రామకృష్ణారెడ్డి, కులసచివులు ఆచార్య విజయరాఘవ ప్రసాద్‌, సలహా మండలి సభ్యుడు ఆచార్య చంద్రశేఖరరెడ్డి, ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి, కట్టా నరసింహులు, షేక్‌ హుసేన్‌, పోతురాజు వెంకట సుబ్బన్న, జానమద్ది విజయభాస్కర్‌, సీపీబ్రౌన్‌ భాషా పరిశోధనా కేంద్రం బాధ్యుడు డాక్టర్‌ మూల మల్లికార్జునరెడ్డి తమ సంతాపాన్ని తెలియజేశారు. రామసుబ్బారెడ్డి మృతి పట్ల కడప జిల్లా అభ్యుదయ రచయితల సంఘం తీవ్ర దిగ్భారంతిని వ్యక్తం చేసింది. అరసం అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.ఈశ్వర్‌రెడ్డి ఆదివారం రామసుబ్బారెడ్డి భౌతికకాయానికి అంజలి ఘటించారు. అరసం కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ తవ్వా వెంకటయ్య, మస్తాన్‌వలి, డాక్టర్‌ సురే్‌షబాబు, డా.సాయిప్రసాద్‌, డా.చంద్రశేఖరరెడ్డి తదితరులు నివాళులర్పించారు.

Updated Date - 2020-05-25T10:28:40+05:30 IST