Abn logo
Aug 2 2021 @ 00:43AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

సంఘటనా స్థలంలో టిప్పర్‌, టాటా ఏస్‌ ఆటో

రాయదుర్గం రూరల్‌, ఆగస్టు 1: మండలంలోని కదరంపల్లి సమీప టోల్‌గేట్‌ వద్ద శ నివారం రాత్రి టిప్పర్‌, టాటా ఏస్‌ వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో బెళుగుప్ప మం డలం వెంకటాద్రిపల్లికి చెందిన దశరథ (38) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.  టాటా ఏసీ డ్రైవర్‌ దశరథ రాయదుర్గం నుంచి బెళుగుప్పకు వెళుతుండగా, ఆవులదట్ల సమీపంలోని టోల్‌గేట్‌ వద్ద కళ్యాణదుర్గం వైపు నుంచి రాయదుర్గం వైపు వస్తున్న టిప్పర్‌ ఢీకొంది. ప్రమాదంలో దశరథ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం రాయదుర్గం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ ఈరణ్ణ తెలిపారు.