వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

ABN , First Publish Date - 2022-09-29T05:49:41+05:30 IST

వైసీపీ నిరం కుశపాలనకు నూకలు చెల్లేరోజుల దగ్గరలోనే ఉన్నా యని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నా రు.

వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
భీమిలిలో కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో రిలే దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు

శాసన మండలి సభ్యుడు దువ్వారపు రామారావు

వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై టీడీపీ శ్రేణుల రిలే దీక్ష

భీమునిపట్నం(విశాఖపట్నం), సెప్టెంబరు 28: వైసీపీ నిరం కుశపాలనకు నూకలు చెల్లేరోజుల దగ్గరలోనే ఉన్నా యని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నా రు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పును వ్యతిరేకిస్తూ అధిష్ఠానం పిలుపుమేరకు భీమిలి చిన్న బజారు జంక్షన్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బుధవా రం పార్టీ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. సాయంత్రం వారికి ఎమ్మెల్సీ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో విప క్షం లేని సమయంలో అనైతికంగా పేరుమారుస్తూ జీవోను ఆమోదించడం దారుణమన్నారు. జగన్‌ అధి కారంలోకి వచ్చాక ఏఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఏ యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదన్నారు. అటు వంటప్పుడు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మార్చే అధికారం ఎవరిచ్చారన్నారు. వైసీపీ నిరంకుశ పాల నపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, సమయం వచ్చి నప్పుడు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. కోరాడ రాజబాబు మాట్లాడుతూ వర్సిటీ పేరు మార్పు జీవో ను వెనక్కి తీసుకోకుంటే పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.


పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి డి.ఎ.యన్‌.రాజు మాట్లాడుతూ ఇక్కడ దీక్ష చేసేందుకు పోలీసుల అనుమతి కోరితే సరే అనడానికి 24 గంటలు పట్టిందని, దీన్నిబట్టి విప క్షాల పట్ల ప్రభుత్వం తీరు అర్థం చేసుకోవచ్చన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాల పేర్ల స్థానంలో సొంత కుటుంబం పేర్లు పెట్టుకోవడం సరికాదన్నారు.


ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కార్పొరేటర్లు గంటా అప్పలకొండ, పి.వి. నరసింహం, టీడీపీ నాయకులు గాడు అప్పలనాయుడు, పాసి నర్సింగరావు, గొలగాని నరేంద్రకుమార్‌, గరే సదానంద, మొల్లి లక్ష్మణరావు, కురిమిన లీలావతి, బోయి అనురాధ, అరుణ, తమ్మిన సూరిబాబు, పెంటపల్లి యోగి, గరికిన కింగ్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-29T05:49:41+05:30 IST