Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొన్నేళ్ల క్రితం భర్త మృతి.. ఈ భార్య చేసిన పాడు పని వల్ల పెళ్లీడుకొచ్చిన కూతురు జైలు పాలు.. అసలేం జరిగిందంటే..

అక్రమ సంబంధాలకు అలవాటు పడేవారికి మొదట అంతా బాగానే ఉంటుంది. కానీ చివరకు మాత్రం చేదు అనుభవం ఎదురవక తప్పదు. ఈ విషయం తెలిసినా చాలా మంది.. అందులోనే సుఖం ఉందనుకుంటూ తప్పటడుగులు వేస్తుంటారు. బీహార్‌లో ఓ మహిళ ఇలాగే చేసి.. చివరకు కూతురి జీవితాన్ని కూడా నాశనం చేసింది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. పెళ్లీడుకొచ్చిన కూతురు ఇంట్లో ఉంది. ఆమె భవిష్యత్‌ను బాగుచేద్దామనే స్పృహ కూడా లేకుండా.. ఆ మహిళ చేసిన పాడు పని, ఆఖరకు ఎంతవరకు వెళ్లిదంటే..

బీహార్‌‌లోని దర్భంగాకు చెందిన ఓ మహిళ.. కూతురుతో కలిసి, బిస్రక్ జలాల్‌పూర్‌ అనే గ్రామంలో నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మరణించాడు. దీంతో పెళ్లీడుకొచ్చిన కూతురుతో కలిసి ఆమె ఒక్కటే ఉంటోంది. ఈ సమయంలో కూతురికి మంచి సంబంధం చూసి, పెళ్లి చేయాలని ఏ తల్లయినా భావిస్తుంది. కానీ ఆమెకు ఆ ఆలోచన ఏమాత్రమూ లేదు. కొన్ని రోజులకు పక్కింటి వ్యక్తితో ప్రేమలో పడింది. ఇంట్లో కూతురు ఉందనే విషయం కూడా మరచిపోయి.. రోజూ అక్కడే ఇద్దరూ రాసలీలలు సాగించేవారు. ఇదంతా గమనించే కూతురు.. బయటికి చెప్పుకోలేక, లోలోపలే కుమిలిపోయేది.

పాడు బుద్ధి ఉన్నవారికి అన్నీ పాడు ఆలోచనలే వస్తాయన్నట్లు.. తల్లితో శృంగారం మొదలెట్టిన ఆ వ్యక్తి, కొన్నాళ్లకు ఆమె కూతురిపై కూడా కన్నేశాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా ప్రియురాలి కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. తల్లితో తప్పు చేస్తున్నా సహించిన కూతురికి.. తన పట్ల కూడా అలాగే ప్రవర్తించడం.. ఆగ్రహాన్ని తెప్పించింది. ఇదే విషయాన్ని తన తల్లికి చెప్పింది. తన వల్ల తన కూతురు జీవితం కూడా పాడవుతుందేమో అని చివరకు తెలుసుకుంది. పద్ధతి మార్చుకోమని ప్రియుడిని మందలించింది. సరే అని చెప్పిన ఆ వ్యక్తి.. కొన్నాళ్లకు మళ్లీ మొదటికొచ్చాడు.

దీంతో విసిగిపోయిన తల్లీకూతుళ్లు..  అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. తల్లి మాటలను కాదనలేక కూతురు కూడా సరే అని ఒప్పుకొంది. ఓ రోజు ఇంటికి పిలిచి కాసేపు ప్రేమగా నటించింది. మాటల్లోకి దించి.. ఒక్కసారిగా కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన అతను.. అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. హత్య జరిగిన స్థలంలో నిందితుడికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తల్లి చేసిన తప్పుడు పనులకు.. కూతురు జీవితం కూడా పాడవడంపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement