పాడి రైతు రోజుకు పది లీటర్ల పాలు పోయాలి

ABN , First Publish Date - 2022-06-26T06:13:47+05:30 IST

ప్రస్తుతం రోజుకి నాలుగు లీటర్లు సరఫరా చేస్తున్న పాడి రైతు పని లీటర్లు పాలు పోసేలా చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ అన్నారు.

పాడి రైతు రోజుకు పది లీటర్ల పాలు పోయాలి
వడ్డాది కస్పా గ్రోయిన్‌ పనులను పరిశీలిస్తున్న ఆనంద్‌కుమార్‌

విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆనందకుమార్‌


బుచ్చెయ్యపేట, జూన్‌ 25: ప్రస్తుతం రోజుకి నాలుగు లీటర్లు  సరఫరా చేస్తున్న పాడి రైతు పని లీటర్లు పాలు పోసేలా చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ అన్నారు. శనివారం రూ.80లక్షలతో చేస్తున్న వడ్డాది కస్పా గ్రోయిన్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ.. పాలు సామర్థ్యం పెంచేందుకు రైతులకు నాణ్యమైన పాడి పశువులను అందిస్తామన్నారు. రోజువారి పాలు సేకరణ 9.3 లక్షల లీటర్లకు చేరుకుందన్నారు. కస్పా గ్రోయిన్‌ మరమ్మతు పనులు 50 శాతం పూర్తయ్యాయని, మరో 15 రోజుల్లో మిగతా పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. కాలువపై కల్వర్టు నిర్మించాలని మాజీ వైస్‌ఎంపీపీ దాడి సూర్యనాగేశ్వరరావు, గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్‌ దొండా కన్నబాబు కోరగా ఆనందకుమార్‌ అంగీకరించారు. ఈ కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్లు గేదెల సత్యనారాయణ, దాడి పవన్‌, వైసీపీ నాయకులు కె.అచ్చెన్నాయుడు, డి.నారాయణమూర్తి, రైతు నాయకులు దాడి పెదగోవింద, శిరిగిరిశెట్టి చినవెంకయ్యదొర, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:13:47+05:30 IST